Share News

ఎండలో.. బండ కష్టాలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:03 PM

భగభగ మండే ఎండల్లో గ్యాస్‌ బండ చుక్కలు చూపిస్తోంది. గ్యాస్‌ సిలిండర్‌ కోసం వినియోగ దారులు గంటల తరబడి క్యూలో వేచియుండాల్సి వస్తోంది.

ఎండలో.. బండ కష్టాలు

(ఆంధ్రజ్యోతి, బెంగళూరు)

భగభగ మండే ఎండల్లో గ్యాస్‌ బండ చుక్కలు చూపిస్తోంది. గ్యాస్‌ సిలిండర్‌ కోసం వినియోగ దారులు గంటల తరబడి క్యూలో వేచియుండాల్సి వస్తోంది. ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ల మధ్య సాగుతున్న యుద్ధం వంటగ్యాస్‏పై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటికే హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య సిలిండర్లు దొరక్క తల్లడిల్లుతున్నారు. సకాలంలో వాణిజ్య సిలిండర్లు అందక మెనూలో మార్పులతోపాటు ధరలు పెంచేశారు. గృహాలకు అవసరమైన సిలిండర్‌ ఖాళీ అయితే కష్టమేనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


pandu1.jpgఓవైపు రంజాన్‌ ఉపవాసాలు, మరోవైపు సమీపిస్తున్న ఉగాది(Ugadi) పండుగతో అందరూ సిలిండర్లకోసం ఎగబడుతున్నారు. శివాజీనగర్‌లో సిలిండర్లకోసం ప్రజలు క్యూ కట్టారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి నిలబడి సిలిండర్‌ తీసుకుంటున్నారు. అయితే అధికారులు మాత్రం గ్యాస్‌ కొరత లేదంటున్నారు.


pandu1.3.jpg

pandu1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

54 వేల టన్నుల LPGతో గుజరాత్ పోర్ట్ చేరుకున్న శివాలిక్ నౌక

ఒడిశాలోని కటక్‌ SCB హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం, పది మంది మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 16 , 2026 | 01:16 PM