Share News

కిలో వంజరం చేపలు రూ.1,500

ABN , Publish Date - May 07 , 2026 | 12:22 PM

తమిళనాడు రాయపురం నియోజకవర్గంలోని కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌లో చేపల ధరలు రెండింతలు పెరగడంపై మాంసాహారులు ఆందోళన చెందుతున్నారు.

కిలో వంజరం చేపలు రూ.1,500
Vanjaram Fish

  • కాశిమేడులో పెరిగిన చేపల ధర

చెన్నై: తమిళనాడు రాయపురం నియోజకవర్గంలోని కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌లో చేపల ధరలు రెండింతలు పెరగడంపై మాంసాహారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చేపల వేట నిషేధం అమల్లో ఉన్నందు వల్ల సముద్ర గర్భంలోకి చేపల వేటకు మర పడవలు వెళ్లలేని పరిస్థితి. దీంతో రాయపురం, కాశిమేడు, పట్టిణంబాక్కం, కోవలం, నాగపట్టిణం, నాగూర్‌, పుదుకోట, రామనాథపురం, రామేశ్వరం తదితర సముద్రతీర జిల్లాల్లో వేల సంఖ్యలో మరపడవలు నిలిచిపోయాయి.


zz.jpgఅదే సమయంలో ఇంధనంతో పనిచేయని చిన్న నాటు పడవలు, ఫైబర్‌ బోట్లలో చేపల వేటలో పాల్గొనేందుకు అనుమతించారు. ఈ పడవల్లో సముద్రంలోకి వెళుతున్న మత్స్యకారులు తమ వలల్లో చిక్కిన చేపలు, రొయ్యలు, పీతలతో తీరానికి చేరుకుని వేలం ద్వారా విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో ఆదివారం చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.


nani1.2.jpg30 ఫైబర్‌ బోటుల్లో సముద్రంలోకి వెళ్లి కాశిమేడు ఫిషింగ్‌ హార్బర్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో చేపలతో జాలర్లు తిరిగొచ్చారు. కిలో వంజరం రూ.1,500, బ్లాక్‌వవ్వాల్‌ రూ.1,200, వైట్‌వవ్వాల్‌ రూ.1,600, ఐవ్‌వవ్వాల్‌ రూ.1,900, పారై రూ.700, సంకర రూ.700, పీతలు రూ.600, రొయ్యలు రూ.500, టైగర్‌ రొయ్యలు రూ.1,400కు విక్రయించారు.


nani1.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

చూస్తే నోరూరు.. తింటే బేజారు!

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

Read Latest Telangana News and National News

Updated Date - May 07 , 2026 | 12:22 PM