Share News

దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా

ABN , Publish Date - Sep 27 , 2026 | 09:59 PM

దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్‌లో ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు.

దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలు.. ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా
LNG Train

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే తొలి ఎల్ఎన్‌జీ రైలును గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్‌లో ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి ఆయన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు తాము ఎల్ఎన్‌జీతో నడిచే రైలును తీసుకువచ్చామని చెప్పారు. 2015-16లో రైల్వేలు 293 కోట్ల డీజిల్‌ను వినియోగించాయని వెల్లడించారు. 2024-25లో మాత్రం ఇది 108 కోట్ల లీటర్లుగా నమోదైందని వివరించారు. దీన్ని 2030 నాటికి సున్నాకు తగ్గిస్తామని అమిత్ షా తెలిపారు.


ఆ తరువాత అమిత్ షా ప్రధాని మోదీ పాలనను ప్రశంసించారు. దేశ రైల్వే వ్యవస్థను ప్రధాని సమూలంగా సంస్కరించారని అన్నారు. అనేక సదుపాయాలు ఆయన కల్పించి, రైల్వేను అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రత్యేక సరకు రవాణా కారిడార్, రాపిడ్ రైల్ సిస్టమ్‌లతో స్టేషన్లను ఆధునీకరించారని పేర్కొన్నారు. హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించడం మరో అద్భుతమని కొనియాడారు.


కాగా డీజిల్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఎల్ఎన్‌జీని (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) వాడకాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ఎల్ఎన్‌జీ రైలును ప్రారంభించింది. ఆ రైలు అటు డీజిల్‌తో, ఇటు ఎల్ఎన్‌జీతో నడుస్తుంది. దాదాపు 40 శాతం మేర డీజిల్ వాటా తగ్గుతుంది. డీజిల్ వాడకం. ఇంధన వ్యయాలు, ఉద్గారాలు తగ్గించాలనే లక్ష్యంతో దీనిని ప్రవేశపెట్టారు.


ఈ వార్తలూ చదవండి

సీజేపీ నిరసనకు వాంగ్‌చుక్ మద్దతు.. ఈసారి సీఈసీకి వ్యతిరేకంగా..

తీవ్ర రూపం దాల్చిన విద్యార్థుల నిరసనలు.. యుద్ధ విమానంపైకి ఎక్కి..

Updated Date - Sep 27 , 2026 | 10:04 PM