అక్టోబర్ 7 దాడికి ముందే హమాస్ హెచ్చరిక: ఇజ్రాయెల్ మాజీ మంత్రి
ABN , Publish Date - Sep 27 , 2026 | 09:47 PM
తమ దేశంపై 2023 అక్టోబర్ 7న జరిగిన దాడికి ముందు హమాస్ నుంచి ఓ హెచ్చరిక అందిందని ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: తమ దేశంపై 2023 అక్టోబర్ 7న జరిగిన దాడికి ముందు హమాస్ నుంచి ఓ హెచ్చరిక అందిందని ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ వెల్లడించారు. హమాస్ నుంచి వచ్చిన సందేశాన్ని ఇజ్రాయెల్ భద్రతా సంస్థలు మరో ఘటనకు సంబంధించినదిగా అర్థం చేసుకున్నాయని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో చర్చకు దారితీశాయి (Hamas warning October 7).
ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ రేడియోతో గల్లాంట్ (Yoav Gallant) మాట్లాడారు. అక్టోబర్ 7 దాడికి కొన్ని వారాల ముందు షిన్ బెట్ అనే అంతర్గత భద్రతా సంస్థకు హమాస్ నుంచి ఒక సందేశం అందిందని చెప్పారు. ఆ సందేశంలో హమాస్ నాయకుడు యాహ్యా సిన్వర్ 'జైళ్లను కుదిపేస్తాను' అని హెచ్చరించినట్టు గల్లాంట్ తెలిపారు. అయితే ఈ సందేశాన్ని ఇరాక్‌లో అపహరణకు గురైన ఇజ్రాయెల్ పరిశోధకురాలు ఎలిజబెత్ త్సుర్కోవ్‌కు సంబంధించినదిగా అంచనా వేసినట్లు ఆయన వివరించారు.
ఆ సందేశం అక్టోబర్ 7న జరగబోయే భారీ దాడికి సంబంధించినదని ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థలు గుర్తించలేకపోయాయి (Israel Hamas war). దీంతో ఇజ్రాయెల్ భారీ నష్టం చవిచూడాల్సి వచ్చింది. 2023, అక్టోబర్ 7న హమాస్, ఇతర పాలస్తీనా సాయుధ గ్రూపులకు చెందిన వందలాది మంది గాజా సరిహద్దు కంచెను దాటి దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి దాడులు చేశారు. ఈ దాడుల్లో 1,200 మందికి పైగా ఇజ్రాయెలీలు, విదేశీయులు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఏవి పని చేయవు.. ఏవి పనిచేస్తాయంటే..
వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఆర్టీఐపై జారీ చేసిన కీలక ఉత్తర్వులు రద్దు..