Share News

మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఏవి పని చేయవు.. ఏవి పనిచేస్తాయంటే..

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:41 PM

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఈ సమ్మె కొనసాగనుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ సమ్మె జరగనుంది.

మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఏవి పని చేయవు.. ఏవి పనిచేస్తాయంటే..
Bank Strike 2026

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ఈ సమ్మె కొనసాగనుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ సమ్మె జరగనుంది. ముఖ్యంగా ఐదు రోజుల పనిదినాల విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో పాటు పెన్షన్, ఉద్యోగ సంబంధిత అంశాలను సంఘాలు ప్రస్తావిస్తున్నాయి (Bank Strike 2026).


ఈ సమ్మె కారణంగా సోమ, మంగళ, బుధవారాల్లో బ్యాంకులు పని చేయవు. ఈ సమ్మె ప్రభావం ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులపై ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగ బ్యాంకులపై ఈ సమ్మె ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అయితే బ్యాంకును బట్టి సేవల్లో కొంత మార్పు ఉండొచ్చు (Bank Strike September 28 29 30).


ఏవి పని చేయవు..

  • శాఖలలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్..

  • పాస్‌బుక్ అప్‌డేట్‌లు..

  • చెక్కు ప్రాసెసింగ్..

  • డిమాండ్ డ్రాఫ్ట్‌లు..

  • కేవైసీ, ఖాతా సంబంధిత పనులు..

  • రుణ సంబంధిత ప్రక్రియ..

  • లాకర్ సేవలు..

ఏవి పని చేస్తాయి..

  • యూపీఐ చెల్లింపులు..

  • మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్..

  • ఏటీఎంలు పని చేస్తాయి..

  • నగదు డిపాజిట్ యంత్రాలు..


ఇవీ చదవండి:

శాంతిని కోరుకున్నామంటే బలహీనమని కాదు: రాజ్‌నాథ్ సింగ్

ఫోన్‌ స్టోరేజీ నిండిపోయిందా? ఈ 5 చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందండిలా..

Updated Date - Sep 27 , 2026 | 03:41 PM