నా కుటుంబాన్ని దూషించాడు.. యువకుడిని కొట్టడంపై ఢిల్లీ మంత్రి వివరణ..
ABN , Publish Date - Sep 27 , 2026 | 08:49 PM
తన కుటుంబాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త దూషించాడని, అందుకే అతడిపై చేయి చేసుకున్నానని ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ వివరణ ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: తన కుటుంబాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త దూషించాడని, అందుకే అతడిపై చేయి చేసుకున్నానని ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్ వర్మ వివరణ ఇచ్చారు. ఆదివారం ఉదయం మంత్రి పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్‌లో రహదారి పనులను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తుండగా అతడిని పర్వేశ్ వర్మ కొట్టిన వీడియో వైరల్ అయింది (Parvesh Verma slap row).
తిలక్ నగర్‌లో రహదారి నిర్మాణ పనులను పరిశీలించేందుకు పర్వేశ్ వర్మ వెళ్లారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కూడా ఉన్నారు. రహదారి నాణ్యతపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పర్వేశ్ వర్మ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయనను ఓ వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తూ వెళ్లాడు. ఆ సమయంలో మంత్రి అతడి ఫోన్‌ను కిందకు లాగి, అతడిని కొట్టినట్లు వీడియోలో కనిపించింది (Parvesh Verma viral video).
యువకుడిని కొట్టడంపై పర్వేశ్ వర్మ స్పందించారు. జర్నైల్ సింగ్‌తో వచ్చిన ఓ కార్యకర్త తన కుటుంబాన్ని దూషించాడని ఆయన ఆరోపించారు (AAP BJP Delhi). దీంతో కోపంలో తాను స్పందించానని చెప్పారు. 'నా కుటుంబాన్ని అతడు దూషించాడు. ఆ సమయంలో ఎవరైనా కోపంతో స్పందిస్తారు. నేనూ అలాగే స్పందించాను' అని పర్వేశ్ వర్మ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. అయితే అలా జరగకుండా ఉండాల్సిందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మూడు రోజులు బ్యాంకులు బంద్.. ఏవి పని చేయవు.. ఏవి పనిచేస్తాయంటే..
వెనక్కి తగ్గిన విజయ్ ప్రభుత్వం.. ఆర్టీఐపై జారీ చేసిన కీలక ఉత్తర్వులు రద్దు..