Share News

విదేశీ నిధులపై మరింత నిఘా.. FCRA బిల్లుపై జేపీసీలో కీలక చర్చ

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:51 AM

FCRA బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. రెండోసారి భేటీలో పలు అంశాలపై ఈ కమిటీ చర్చించనుంది.

విదేశీ నిధులపై మరింత నిఘా.. FCRA  బిల్లుపై జేపీసీలో కీలక చర్చ
Foreign Funding

ఢిల్లీ, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): FCRA బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు (మంగళవారం) సమావేశం కానుంది. రెండోసారి భేటీలో పలు అంశాలపై ఈ కమిటీ చర్చించనుంది. విదేశీ నిధుల చట్ట సవరణ బిల్లు-2026లోని ప్రతి అంశంపైనా హోం, న్యాయ శాఖల అధికారులు ఈ కమిటీకి వివరాలను అందించనున్నారు. విదేశీ నిధుల వినియోగం, ఖాతాల నిర్వహణపై ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మధ్యాహ్నం 2 గంటలకు కమిటీ ముందుకు రానున్నారు. బిల్లులోని నిబంధనలు, చట్టపరమైన చిక్కులపై అభిప్రాయాలను అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ తెలపనున్నారు.


సెప్టెంబర్ 18వ తేదీన జరిగిన మొదటి సమావేశంలో విదేశీ నిధుల పర్యవేక్షణ, పారదర్శకతపై హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్జీవోలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు పొందే విదేశీ నిధుల వినియోగంపై పూర్తి డిజిటల్ పర్యవేక్షణకు సవరణలు చేయనున్నారు. లైసెన్స్ రద్దయిన సంస్థల ఆస్తులను పర్యవేక్షించడానికి లేదా వేలం వేయడానికి ప్రత్యేక అధికారాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయనున్నారు. స్వచ్ఛంద సంస్థలు, మైనార్టీ విద్యాలయాలను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ చట్ట సవరణలంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ ప్రయోజనాలు, దేశ అంతర్గత భద్రతను కాపాడటానికే విదేశీ నిధుల చట్టంలో మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్

రేవంత్‌.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్

హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 12:18 PM