Share News

ఎటుచూసినా హత్యలేనా?

ABN , Publish Date - Mar 10 , 2026 | 01:05 PM

ద్రావిడ మోడల్‌ డీఎంకే పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు జరుగుతున్నాయని, ఈ ఐదేళ్లలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధ్వజమెత్తారు.

ఎటుచూసినా హత్యలేనా?

  • డీఎంకే ప్రభుత్వంపై ఈపీఎస్‌ ధ్వజం

చెన్నై: ద్రావిడ మోడల్‌ డీఎంకే పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు జరుగుతున్నాయని, ఈ ఐదేళ్లలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధ్వజమెత్తారు. కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీపంలో ఓ వృద్ధుడి దారుణ హత్య, ఆయన భార్యపై అత్యాచారానికి పాల్పడిన ఘటన, చెన్నై త్రిశూలం ప్రాంతంలో ఓ గుడిసెలో చొరపడిన దుండగులు ఓ వ్యక్తిని హత్య చేసి పరారైయ్యారు.


ఈ విధంగా వరుస హత్యలు జరిగినట్లు సమాజిక మాధ్యమాలు కోడైకూస్తున్న నేపథ్యంలో, ఈపీఎస్‌ డీఎంకే ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగత్తై మీడ్పోం’ అనే నినాదంతో ఈపీఎస్‌ ప్రారంభించిన ప్రచారయాత్ర ఆదివారం రాత్రి భవానీ నియోజకవర్గం చేరుకుంది. ఈ సందర్భంగా ఈపీఎస్‌ మాట్లాడుతూ, స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో శాంతి భద్రతలు అదోపాతాళానికి చేరుకున్నాయని, ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు బ్రతుకుతున్నారని ఆరోపించారు.


nani2.2.jpgఈఐదేళ్లలో ఒక్కసారైనా శాంతిభద్రతలగురించి స్టాలిన్‌ పెదవి విప్పలేదన్నారు. తెన్‌కాశిరైతు హత్యలో ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించినట్లు బాధిత కుటుం బం రోడ్డెక్కి నిరసన తెలిపిందని, అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. నేరాలకు,ఘోరాలకు అడ్డాగా రాష్ట్రం మారిందని, ప్రజా వ్యతిరేక డీఎంకేకు కౌండౌన్‌ ప్రారంభమైందని ఈపీఎస్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

గొర్రెలకు మేతగా టమోటా పంట

డేటింగ్ యాప్‌లో పరిచయం.. స్నేహమంటూ దగ్గరై 51 ఏళ్ల వ్యక్తిని

Read Latest Telangana News and National News

Updated Date - Mar 10 , 2026 | 01:05 PM