Share News

కర్ణాటకలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.5 గా నమోదు

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:33 AM

కర్ణాటకలోని విజయపుర జిల్లాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భయాందోళనలతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5 గా నమోదైంది.

కర్ణాటకలో భూప్రకంపనలు.. రిక్టర్‌ స్కేల్‌పై 3.5 గా నమోదు
earthquake in karnataka

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో భూమి ప్రకంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5గా నమోదైనట్లు కర్ణాటక విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


బుధవారం తెల్లవారుజామున 2.04 సమయంలో విజయపుర జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. బసవన్న బాగేవాడి ప్రాంతానికి ఈశాన్యదిశగా 3.9 కి.మీ దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. భూకంప తీవ్రత తక్కువ మోతాదులో ఉండడం వల్ల ప్రమాదమేమి లేదని వారు తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

బంగారం యూటర్న్.. మరోసారి పెరిగిన ధరలు

‘జీ’ సుభాష్‌ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు

Updated Date - Sep 30 , 2026 | 01:16 PM