Share News

జీ’ సుభాష్‌ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:57 AM

NCLAT Issues Notices to Subhash Chandra’s Creditorsసుభాష్‌ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు

జీ’ సుభాష్‌ చంద్ర  రుణదాతలకు   ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు
NCELT

‘న్యూఢిల్లీ: జీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా ఆయన రుణదాతలకు జాతీయ కంపెనీల చట్టం అప్పిల్లేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) మంగళవారం నోటీసులు జారీ చేసింది. అలాగే, చంద్ర పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబరు 29, 30 తేదీలకు వాయిదా వేసింది. తమ నోటీసులపై వారంలోగా స్పందించాలని రుణదాతలను ఎన్‌సీఎల్‌ఏటీ నిర్దేశించింది. సుభాష్‌ చంద్ర పై వ్యక్తిగత దివాలా పరిష్కార కేసులో పలువురు రుణదాతల నుంచి రూ.22,006.57 కోట్ల బకాయిల రికవరీ కోసం క్లెయిమ్‌లు రాగా.. ఈ రుణాలకు వ్యక్తిగత హామీదారుగా ఉన్న సుభాష్‌ చంద్ర కేవలం రూ.6.5 కోట్ల తిరిగి చెల్లింపులను ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Sep 30 , 2026 | 03:01 AM