వాహనదారులకు అలర్ట్.. సెప్టెంబర్ 25లోపు ఈ పని చేయకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:12 PM
సెప్టెంబర్ 25లోపు మీ డ్రైవింగ్ లైసెన్స్‌తో మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే లైసెన్స్ రద్దు అవుతుందని హెచ్చరించింది. ఇంట్లోనే మొబైల్ నంబర్ అప్‌డేట్ ప్రక్రియను ఎలా చేసుకోవాలంటే..
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులందరూ తమ డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 25 లోపు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలంటూ ప్రకటించింది. అయితే తుది గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే లైసెన్స్‌లు రద్దవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రక్రియను ఇంట్లోనే పూర్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు. సారథి పోర్టల్‌లో దీన్ని ఉచితంగా చేసుకోవచ్చని చెబుతున్నారు.
అప్‌డేట్ ఎందుకు?
పాత లైసెన్స్‌లలో మొబైల్ నంబర్లు లేకపోవడం, కొత్త వాటిలో పని చేయని (ఇన్‌యాక్టివ్) నంబర్లు ఉండడం వల్ల చాలా డిజిటల్ సేవలకు అంతరాయం కలుగుతోంది. అందుకే వాహనదారులందరూ లైసెన్స్‌లకు యాక్టివ్ నంబర్లు లింక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ-చలాన్లు, ట్రాఫిక్ నోటిఫికేషన్లు లాంటివి సకాలంలో అందాలంటే యాక్టివ్ నంబర్ ఉండాల్సిందే. మరోవైపు అసలు నంబరే లేని లైసెన్స్‌ల వల్ల తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇంట్లో ఉండే లింక్ చేసుకోవచ్చు
లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేసుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు. అలాగే దీనికి ఎక్కువ సమయం కూడా కేటాయించక్కర్లేదు. సమీపంలోని ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం అసలే లేదు.
మొదట మొబైల్‌లో లేదా కంప్యూటర్లో సారథి పరివాహన్ పోర్టల్ (sarathi.parivahan.gov.in) ఓపెన్ చేయండి
తరువాత ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ఆప్షన్‌ను ఎంచుకోండి
హోమ్ పేజీలో ఉన్న ‘అదర్స్ మెనూ’లోకి వెళ్లండి
అందులో ‘మొబైల్ నంబర్ అప్‌డేట్’పైన నొక్కండి
డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి
అన్నీ వివరాలు సరిగ్గా ఉన్నయో లేదో చూసుకోండి
ఇప్పుడు అప్‌డేట్ చేయాల్సిన కొత్త మొబైల్ నంబర్‌ను సబ్మిట్ చేయండి.
చివర్లో ఓటీపీ ఎంటర్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది
ఇలా సులభంగా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయండి. ఇదంతా చేయడానికి తుది గడువు సెప్టెంబర్ 25 అని గుర్తు పెట్టుకోండి.
ఇవీ చదవండి
లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నాడంటూ యూపీలో ఓ ఉపాధ్యాయుడి కాల్చివేత
యూపీఐ చార్జీలు.. కేంద్రానికి మద్దతుగా నిలిచిన కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా