యూపీఐ చార్జీలు.. కేంద్రానికి మద్దతుగా నిలిచిన కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
ABN , Publish Date - Sep 17 , 2026 | 10:30 AM
పర్సన్ టు మర్చంట్ యూపీఐ పేమెంట్లపై 0.4 శాతం చార్జీ వసూలు చేయడాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా సమర్థించారు. యూపీఐ యాప్‌లు వాడే ప్రతిఒక్కరిపై చార్జీల భారం పడదని, లావాదేవీలు రూ.2 వేలు దాటితేనే చార్జీ పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: పర్సన్ టు మర్చంట్ యూపీఐ పేమెంట్లపై 0.4 శాతం చార్జీ వసూలు చేయడాన్ని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా సమర్థించారు. యూపీఐ యాప్‌లు వాడే ప్రతిఒక్కరిపై చార్జీల భారం పడదని, లావాదేవీలు రూ.2 వేలు దాటితేనే చార్జీ పడుతుందని ఆయన పేర్కొన్నారు. అదికూడా వ్యాపారి చెల్లిస్తాడని, సాధారణ వినియోగదారుడు చెల్లించడని చెప్పారు. గురువారం శ్రీనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పర్సన్ టు పర్సన్ చెల్లింపులన్నీ పూర్తిగా ఉచితమని గుర్తుచేశారు. ‘యూపీఐ యాప్‌లను వాడే ప్రతిఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ యాప్‌ల ద్వారా చేసే ప్రతి చెల్లింపునకు వినియోగదారుడిపై భారం పడదు. వ్యాపారి నుంచి మాత్రమే మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ను వసూలు చేస్తారు. దేశవ్యాప్తంగా యూపీఐ లాంటి వ్యవస్థలను నడపాలంటే చాలా డబ్బు కావాలి. ఇప్పటి వరకూ అలాంటి వ్యవస్థను మనమంతా ఫ్రీగా ఉపయోగించాం. యూపీఐ సిస్టమ్ నడపడం అంత సులభం కాదు. చీప్ కూడా కాదు. మనకు ఉచితంగా దొరికే వాటి విలువను మనం అర్థం చేసుకోం’ అని ఒమర్ పేర్కొన్నారు.
సాధారణ వినియోగదారులపై భారం పడకుండా చూడాలి
యూపీఐ యాప్‌లు వాడే సాధారణ వినియోగదారులపై భారం పడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒమర్ అబ్దుల్లా కోరారు. ‘కంపెనీలను చార్జి చేస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే, కంపెనీలు వ్యాపారం చేసి చాలా డబ్బు గడిస్తాయి’ అని ఒమర్ అన్నారు. కాగా.. ఎండీఆర్ చార్జీలు వసూలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆ పార్టీ మిత్రపక్ష నేత ఒమర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకుముందు కూడా వందేమాతరం మొత్తం చరణాలను ఆలపించడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చేసిన విషయం తెలిసిందే.
Also Read:
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్