Share News

దృశ్యం సినిమా చూసి తండ్రిని చంపిన కొడుకు.. హత్య కోసం 2000 కి.మీ ప్రయాణం

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:55 PM

ఇటీవలే ‘దృశ్యం 3’ సినిమా చూసిన ఓ వ్యక్తి పొందకూడని ప్రేరణ పొందాడు. ఆ చిత్రం నుంచి స్ఫూర్తి పొంది కన్న తండ్రినే హత్య చేశాడు.

దృశ్యం సినిమా చూసి తండ్రిని చంపిన కొడుకు.. హత్య కోసం  2000 కి.మీ ప్రయాణం
Raghuveer and Shiv Shankar

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి ‘దృశ్యం 3’ చిత్రం నుంచి స్ఫూర్తి పొంది, 2000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కన్న తండ్రినే హత్య చేశాడు. అయితే తన భార్యకు చేసిన ఒకే ఒక ఫోన్ కాల్ అతణ్ని పోలీసులకు పట్టించింది. బిహార్‌కు చెందిన శివ్ శంకర్ తన భార్యతో కలిసి సూరత్‌లో నివసిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా శివ్ శంకర్‌కు, అతడి తండ్రి రఘువీర్‌కు మధ్య ఓ భూ వివాదం నడుస్తోంది. ఇటీవలే ‘దృశ్యం 3’ సినిమా చూసిన శివ్ శంకర్ పొందకూడని ప్రేరణ పొందాడు. అందులో నేరం నుంచి తప్పించుకున్నట్టుగా తాను కూడా తండ్రిని హత్య చేసి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు.


అనుకున్నట్టుగానే తండ్రిని హత్య చేయడం కోసం గత జూలై 26న రఘువీర్ నివసించే బిహార్‌లోని సమస్తిపూర్‌కు శివ్ శంకర్ బయలుదేరాడు. ఈ ప్రయాణానికి ముందు తన మొబైల్‌ను స్విచ్ఆఫ్ చేశాడు. అర్ధరాత్రి అయ్యాక తండ్రి ఇంటికి వెళ్లాడు. గుమ్మం దగ్గర నిద్రిస్తున్న రఘువీర్‌ను గొడ్డలితో నరికేశాడు. ఆ తరువాత సూరత్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే మధ్యలో ఒక్కసారి ఫోన్ స్విచ్ఆన్ చేసి భార్యతో మాట్లాడి, మళ్లీ స్విచ్ఆఫ్ చేసేశాడు. ఇదే అతణ్ని పోలీసులకు దొరికిపోయేలా చేసింది. పైగా అతడు తండ్రి అంత్యక్రియలకు రాకపోవడంతో పోలీసులకు అనుమానం పెరిగింది.


దృశ్యం సినిమానే స్ఫూర్తి

శివ్ శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ‘దృశ్యం 3’ సినిమా చూసిన తరువాతే తాను హత్యకు ప్రణాళిక రచించానని నిందితుడు చెప్పాడు. ఆ చిత్రంలో కథానాయకుడు నేరం జరిగిన సమయంలో వేరే చోట ఉన్నట్టు చిత్రీకరిస్తాడు. అలానే తాను చిత్రీకరించాలని అనుకున్నానని వివరించాడు. అందులో హీరో పోలీసులను తప్పుదోవ పట్టిస్తాడు. తాను అదే చేయాలని భావించానని నిందితుడు తెలిపాడు.


ఈ వార్తలూ చదవండి

పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్

క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!

Updated Date - Oct 04 , 2026 | 07:03 PM