స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి: మంత్రి నారాయణ
ABN , Publish Date - Oct 04 , 2026 | 01:15 PM
నగరంలో రూ.2.8 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని స్పష్టం చేశారు.
నెల్లూరు, అక్టోబర్ 4: నగరంలో రూ.2.8 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని స్పష్టం చేశారు. 16వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయని, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోతే ఈ నిధులు వచ్చే అవకాశం ఉండదని తెలిపారు.
ఎన్నికలు జరగకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. ఎన్నికలకు ఆటంకాలు సృష్టిస్తున్నప్పటికీ వాటిని అధిగమించి ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో 23 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగకుండా వైసీపీ ద్రోహం చేసిందని, దీంతో ఆయా మున్సిపాలిటీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నీరుగారిపోయాయని విమర్శించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని మంత్రి నారాయణ అన్నారు. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. అక్రమ కేసులు పెట్టి బెదిరించే ప్రభుత్వం ఎవరిదో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు సంతోషంగా ఉన్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆర్థిక సంఘం నిధులు అందడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో