Share News

బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం.. తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చాం: మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:38 PM

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన బాలుడు రామయ్య ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ విషయాన్ని ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

బాలుడు రామయ్య ఆచూకీ లభ్యం.. తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చాం: మంత్రి లోకేశ్..
Missing Boy Ramayya

నెల్లూరు జిల్లా: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన బాలుడు రామయ్య ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.


ఈ సందర్భంగా బాలుడు రామయ్య దొరికిన విషయాన్ని తెలియజేయడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అందరి ప్రార్థనలు ఫలించాయని, చిన్నారిని సురక్షితంగా ఇంటికి చేర్చినట్లు తెలిపారు. గొర్రెల కాపరి రామయ్య అనే బాలుడి గురించి అందరూ నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఎంతో ఆందోళనగా పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. చిన్నారి వీడియో చూసి తానూ తీవ్రంగా కలత చెందినట్లు వెల్లడించారు. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పని చేసి రామయ్యను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు మంత్రి తెలిపారు.


చిన్నారిని రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్చబోతున్నామని, అతని తండ్రికి మెరుగైన వైద్యసాయం అందించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. అలాగే, బాలుడి తల్లికి స్వయం ఉపాధి కల్పించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రామయ్య గురించి తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆగమేఘాల మీద స్పందించి బాలుడి ఆచూకీ కనుక్కొని, తల్లిదండ్రుల చెంతకు చేర్చిన నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలియజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రభుత్వ విధానాలను మార్చి పేదలకు సేవ చేయటమే నా బాధ్యత: సీఎం చంద్రబాబు

బీసీ రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు స్పందన

Updated Date - Oct 01 , 2026 | 07:33 PM