Delhi Metro Official Family: ఘోర అగ్ని ప్రమాదం.. మెట్రో అధికారితో సహా..
ABN , Publish Date - Jan 06 , 2026 | 08:20 PM
ఢిల్లీలో మంగళవారం తెల్లవారు జామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో అధికారితో సహా అతడి కుటుంబం మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయం, జనవరి 06: ఢిల్లీలోని ఒక ఫ్లాట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మెట్రో అధికారితో సహా ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. మృతులను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)లో అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నలింగ్ అండ్ టెలికాం)గా పనిచేస్తున్న అజయ్ విమల్ (45), ఆయన భార్య నీలమ్ (38) మరియు వారి 10 ఏళ్ల కుమార్తె జాహ్నవిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఢిల్లీ నగరం, ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ లో అజయ్ విమల్.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడికి జాహ్నవి అనే 10 ఏళ్ల కుమార్తె ఉంది. అజయ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ సెక్షన్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో వారు ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూడగా.. బెడ్ రూమ్ తీవ్రమైన గాయాలతో అజయ్ కుటుంబం కనిపించింది.
ఆస్పత్రికి తరలిస్తుండగానే వారు మరణించారు. ఇక మంటలు ఆర్పే క్రమంలో అగ్నిమాపక శాఖకు చెందిన రమేశ్ అనే ఉద్యోగికి కూడా గాయాలయ్యాయి. దీంతో ఆయనకు జగ్జీవన్ ఆసుపత్రిలో చికిత్స అందించి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీటిని వేడి చేసేందుకు పెట్టిన హీటర్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదంలో తమ సహోద్యోగి కుటుంబం మరణిచిందని DMRC కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ ధృవీకరించారు.
ఇవి కూడా చదవండి..
విధి నిర్వహణలో వైఫల్యం.. సీఏక్యూఎంపై సుప్రీంకోర్టు అసహనం
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి