Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ నిర్మాణంపై వైసీపీకి పట్టాభిరామ్ సవాల్
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:59 PM
2017 ఆగస్టు 14న పర్యావరణ అనుమతులు తెచ్చి, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించింది చంద్రబాబేనని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలు, కేంద్ర ప్రభుత్వ లేఖలపై చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కి సవాల్ విసిరారు. అమరావతిలో ఇవాళ జరిపిన మీడియా సమావేశంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (ఇప్పుడు అల్లూరి సీతారామ రాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు) నిర్మాణ చరిత్రను ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం (2014-2019) శ్రీకారం చుట్టిందని, వైసీపీ నేతలు ఆ క్రెడిట్ కొట్టేయ్యాలని చేస్తున్నారని పట్టాభి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు టైమ్‌లైన్‌ను వివరించారు.
పట్టాభి వివరణ:
2015 ఫిబ్రవరి 19న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో చంద్రబాబు నాయుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు ప్రకటించారు.
2015 ఫిబ్రవరి 25న GO నెం.63 ద్వారా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కోసం ప్రత్యేక SPV ఏర్పాటు.
2016 జనవరి 7న కేంద్ర విమానయాన శాఖ సైట్ క్లియరెన్స్ ఇచ్చింది.
GO నెం.64 ద్వారా రైతులకు అత్యధిక నష్టపరిహారం నిర్ణయం.
GO నెం.39 ద్వారా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు.
2016 అక్టోబర్ 7న కేంద్రం ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చింది.
2017 ఆగస్టు 14న పర్యావరణ అనుమతులు పొందారు.
2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు ఫౌండేషన్ స్టోన్ వేశారు, కానీ ఆ తర్వాత పనులు ఆలస్యమయ్యాయి.
2014-2019 మధ్య భూసేకరణపై రూ.750 కోట్లు ఖర్చు చేశారు.
2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం రూ.203 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
2023 మే 3న జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫౌండేషన్ లేడ్ చేశారు. అని పట్టాభిరామ్ వివరించారు.
ఇటీవల భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 2026 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు ఆధ్వర్యంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని కూడా పట్టాభి ఈ సందర్భంగా అన్నారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని చంద్రబాబు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా పట్టాభి గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి