ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. పలు మొబైల్ దుకాణాల దగ్ధం
ABN , Publish Date - Nov 06 , 2026 | 09:43 AM
ఢిల్లీలో కరోల్‌బాగ్ ఏరియాలోని గఫ్ఫార్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో పలు మొబైల్ దుకాణాలు కాలిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో కరోల్‌బాగ్ ఏరియాలోని గఫ్ఫార్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో పలు మొబైల్ దుకాణాలు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం అంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో మొబైల్ బ్యాటరీలు ఉంచారని, అక్కడే మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. దీంతో భవనంలోని నాలుగు అంతస్తులకూ అగ్నికీలలు వ్యాప్తి చెందాయని వెల్లడించారు.
మంటలను ఆర్పేందుకు మొత్తం 22 ఫైర్ టెండర్లు, మూడు క్యాట్ అంబులెన్సులు, రెండు పీసీఆర్ వాహనాలను వినియోగించామని వివరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎలాంటి శాంతిభద్రతల సమస్య లేదని చెప్పారు. అలాగే ఈ ప్రమాదంలో ఆస్తినష్టం మాత్రమే సంభవించిందని, ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలిపారు. మొబైల్ బ్యాటరీలను ఓవర్‌హీట్ చేయడం లేదా ఓవర్‌చార్జింగ్ పెట్టడం వల్లే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నామని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి వేళ రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..
అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే డెడ్‌లైన్ మొదలు.. సుప్రీం కోర్టు స్పష్టత