Share News

కొఠియా వివాదం.. ఓటుకు దూరం

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:39 AM

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న కొఠియా గ్రామాల ప్రజలు ఓటు వేయకుండా ఒడిశా అధికారులు అడ్డుకున్నారు.

కొఠియా వివాదం.. ఓటుకు దూరం

  • జమదాంగి గ్రామస్థులను అడ్డుకున్న ఒడిశా అధికారులు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న కొఠియా గ్రామాల ప్రజలు ఓటు వేయకుండా ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలోని జమదాంగి గ్రామానికి గురువారం ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ చేరుకున్నారు. గ్రామానికి వెళ్లే దారిలో చెక్‌పోస్టు, బారికేడ్లు ఏర్పాటుచేసి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళుతున్న గ్రామస్థులను అడ్డుకున్నారు. దీంతో సుమారు 120 మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. జమదాంగి గ్రామం మల్కన్‌గిరి జిల్లా ధూలిపుట్‌ పంచాయతీ పరిధిలోకి వస్తుందని, ఇది ఒడిశా భూభాగంలో ఉందని అక్కడి అధికారులు వాదిస్తున్నారు. ఈ విషయమై సోమవారం అల్లూరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గిరిజనులు వాపోయారు.

- పెదబయలు, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 06 , 2026 | 06:39 AM