స్టార్‌లింక్‌కు అనుమతుల జాప్యంపై మస్క్ అసంతృప్తి
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:10 AM
భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి అనుమతులు జాప్యం కావడంపై దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపైనా, రిలయెన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీపైనా ఎక్స్‌లోఆయన విమర్శలు చేశారు. ముఖ్యంగా అంబానీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి అనుమతులు జాప్యం కావడంపై దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపైనా, రిలయెన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీపైనా ఎక్స్‌లోఆయన విమర్శలు చేశారు. ముఖ్యంగా అంబానీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ప్రియమైన భారత ప్రధాని అంబానీ గారూ.. ఇండియాకు మీరే అసలైన బాస్ అని తెలుసుకోలేనందుకు దయచేసి నా క్షమాపణలను అంగీకరించండి. సాధారణంగా భారతదేశ ప్రజలను మీ గుత్తాధిపత్యంతో దోచుకోవడానికి మీరు ఇష్టపడతారు. అలాంటి పరిస్థితుల్లో భారత్‌లో స్టార్‌లింక్ మీకు పోటీ ఇవ్వడానికి మీరు ఎలా ఒప్పుకుంటారు? ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేదు. అలాగే భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. వ్యాపారులు తమ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్‌లో అమ్మలేకపోతున్నారు. స్టార్‌లింక్ అలాంటి ప్రజల జీవితాలను మార్చగలదు’’ అని మస్క్ పేర్కొన్నారు. కాగా.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన మూడు గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ కంపెనీల్లో స్టార్‌లింక్ ఒకటి. ఇక శాట్‌కామ్ సేవలు ప్రారంభించేందుకు భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన యూటెల్‌సాట్ వన్ వెబ్, జియో సాటిలైట్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కు ఇదివరకే కేంద్ర ప్రభుత్వం అనమతులు ఇచ్చింది.
గుత్తాధిపత్య కంపెనీలు అడ్డుకుంటున్నాయి
ఇండియాలో కొన్ని కొత్తాధిపత్య కంపెనీలు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నాయని ఈనెల 7న కూడా ఎక్స్‌లో ఒక యూజర్‌కు జవాబు ఇస్తూ మస్క్ ఆరోపించారు. ‘‘భారతీయులపై ఆ కంపెనీలు తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటున్నాయి. వారెవరో మీకు తెలుసు. ఇలా చేయడం భారత ప్రజలకు అన్యాయం చేయడమే. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టిన ప్రతి ఒక్క నిబంధనను కూడా మేము పాటించాం. అయినా కూడా మాకు లైసెన్స్ ఇవ్వలేదు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు స్టార్‌లింక్ అత్యవసరమని ఇప్పటికే రుజువైంది’’ అని మస్క్ పేర్కొన్నారు. మస్క్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. ఆయన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. అన్ని టెలికమ్యూనికేషన్ల సేవల కోసం తమ ప్రభుత్వం ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించిందని, ఆ ప్రక్రియ ప్రకారమే అనుమతులు జారీ చేస్తామని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
నోబెల్ దక్కలేదని ట్రంప్ అసహనం.. విజేత పిళ్లైపై విమర్శలు
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి