Share News

నోయిడా ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:38 AM

నోయిడా-జెవార్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా పేరు మారుస్తూ చేసిన తీర్మానాన్ని ఉత్తరప్రదేశ్‌ క్యాబినెట్‌ తీర్మానించింది.

నోయిడా ఎయిర్‌పోర్టుకు మోదీ పేరు
MODI

లఖ్‌నవూ, అక్టోబరు 9: నోయిడా-జెవార్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా పేరు మారుస్తూ చేసిన తీర్మానాన్ని ఉత్తరప్రదేశ్‌ క్యాబినెట్‌ తీర్మానించింది. ఈ ఎయిర్‌పోర్టును యూపీకి బహుమతిగా అభివర్ణించిన ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ క్యాబినెట్‌ తరపున మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోనే ఈ విమానాశ్రయం అతి పెద్దదని, దేశంలో ప్రధాన విమానయాన కూడలిగా అభివృద్ధి చెందనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీ ప్రగతికి మోదీ నాయకత్వం తోడ్పడుతున్నాయని యోగి చెప్పారు.

Updated Date - Oct 10 , 2026 | 04:38 AM