ఎన్‌టీఏ జవాబుదారీగా ఉండాల్సిందే
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:42 AM
నీట్ పేపర్ లీకేజీ ఉదంతాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పనితీరుపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 9: నీట్ పేపర్ లీకేజీ ఉదంతాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పనితీరుపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్‌టీఏ స్వతంత్ర సంస్థగా కాకుండా, పార్లమెంట్‌లోని ఉభయ సభలకు పూర్తి జవాబుదారీగా ఉండేలా చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యసభకు ఒక కీలక నివేదిక సమర్పించింది. సంస్థలో మంజూరైన పోస్టుల్లో 41శాతం ఖాళీలు ఉండటంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న కొద్ది మంది అధికారులు కూడా డిప్యుటేషన్‌పై వచ్చినవారే కావడంతో, డిప్యుటేషన్ సిబ్బందిపై ఆధారపడొద్దని సూచించింది.