సిద్దు స్టింగ్ వీడియో కేసులో కుమారస్వామి సహాయకుడి విచారణ
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:45 PM
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లక్ష్యంగా చేసుకుంటూ స్టింగ్ వీడియోలను ప్రసారం చేసిన కేసులో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కార్యాలయంతో సంబంధం ఉన్న మీడియా కన్సల్టెంట్ ప్రజ్వల్ ప్రసాద్‌ను బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) సైబర్ క్రైం పోలీసులు ప్రశ్నించారు. ప్రసాద్ మంగళవారం సీసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చి పోలీసుల ముందు హాజరయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లక్ష్యంగా చేసుకుంటూ స్టింగ్ వీడియోలను ప్రసారం చేసిన కేసులో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కార్యాలయంతో సంబంధం ఉన్న మీడియా కన్సల్టెంట్ ప్రజ్వల్ ప్రసాద్‌ను బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) సైబర్ క్రైం పోలీసులు ప్రశ్నించారు. ప్రసాద్ మంగళవారం సీసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చి పోలీసుల ముందు హాజరయ్యాడు. విచారణకు హాజరు కావాలని పోలీసులు అంతకుముందు అతనికి నోటీసు పంపారు. ముందస్తు బెయిల్ పొందడానికి ముందు నిందితుడు తప్పించుకోవడంతో పోలీసులు ఆ నోటీసులు జారీ చేశారు. స్టింగ్ వీడియోల కేసులో ప్రసాద్ పాత్రతో పాటు అతని వెనుక ఎవరు ఉన్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను ఢిల్లీలో కొన్నారని, అక్కడే కుమారస్వామి అధికారిక నివాసంలో ప్రసాద్‌కు ఆ ఫోన్ ఇచ్చారని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇదివకే అరెస్టయిన నిందితుడు రితేశ్ పాండే ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ప్రసాద్ సూచనల మేరకే మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసి అప్పగించారని సింగ్ వెల్లడించారు. పాండే, వినోద్ శర్మ అనే వ్యక్తులు ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని ఓ దుకాణంలో ఆ ఫోన్‌ను కొని, మంత్రికి కేటాయించిన అధికారిక నివాసంలో ప్రసాద్‌కు అందజేశారని చెప్పారు.
ఆ వీడియోలను అప్‌లోడ్ చేసిన కేసులో పాండేను గత నెల 24న అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టయిన తొలి వ్యక్తి అతనే. బెంగళూరు సీసీబీ పోలీసులు ఢిల్లీలో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం బెంగళూరుకు తరలించారు. కాగా.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నట్లు ఉన్న రెండు వీడియోలు సెప్టెంబర్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యాయి. ఆ వీడియోలపై సిద్ధరామయ్య కోర్టును ఆశ్రయించారు. వాటికి సంబంధించిన వార్తలను ప్రసారం చేయడం, ప్రచురించడం వంటివి చేయకుండా మీడియాను ఆదేశించాలని కోరారు. అంతేకాకుండా, ఆ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోరుతూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం