Share News

సీఎం ప్రసంగిస్తుండగా వేదికపైకి కొడుకు ఎంట్రీ.. వీడియో వైరల్..

ABN , Publish Date - Nov 13 , 2026 | 08:01 PM

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తన నివాసం వెలుపల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రసంగం మధ్యలో ఆయన కుమారుడు వేదికపైకి వచ్చి.. సందడి చేశాడు.

సీఎం ప్రసంగిస్తుండగా వేదికపైకి కొడుకు ఎంట్రీ.. వీడియో వైరల్..
Conrad Sangma

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా(Meghalaya CM Conrad Sangma) అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, తన కుటుంబానికి కూడా తగినంత సమయం కేటాయిస్తుంటారు. తాజాగా తురాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రజాసభలో సీఎం సంగ్మా మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం చిన్న కొడుకు అకస్మాత్తుగా వేదికపైకి వచ్చి కేరింతలు కొడుతు సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఈ వీడియోను ముఖ్యమంత్రి సంగ్మా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కుమారుడిని 'సహచరుడు' (Colleague) అంటూ సంగ్మా అభివర్ణించారు. ఆ వీడియోలో సీఎం ప్రసంగిస్తుండగా ఆయన చిన్న కుమారుడు అకస్మాత్తుగా వేదికపై వచ్చి.. కాసేపు అటుఇటు తిరుగుతూ కనిపించాడు. తర్వాత సీఎం తన కుమారుడిని ఎత్తుకుని మైక్ ముందుకు తీసుకువచ్చి అక్కడి వారికి పరిచయం చేశారు. అక్కడున్న ప్రజలందరినీ చూస్తూ ఆ చిన్నారి ఎంతో ముద్దుగా 'బై' అని పలకరించాడు.


ఈ అనూహ్యమైన సన్నివేశానికి సభలోని ప్రజలంతా పెద్దపెట్టున చప్పట్లు కొట్టారు. చిన్నారుల అమాయకపు చేష్టలు ఎంతటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా ఇలాంటి మధురమైన క్షణాలు మనసును హత్తుకుంటున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

జేఎన్‌టీయూ సెక్యూరిటీ టెండర్లు పై హైకోర్టు స్టే

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

Updated Date - Nov 13 , 2026 | 08:43 PM