Share News

పొడవైన తీరం, పోర్టులతో ఏపీకి చాలా ఉపయోగం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ABN , Publish Date - Nov 13 , 2026 | 06:22 PM

దేశాభివృద్ధికి పోర్టులు చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. పొడవైన సముద్రతీరం, పోర్టులు ఉండడం ఏపీకి చాలా ఉపయోగంగా ఉందన్నారు. ఏపీలో పోర్టులను మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

పొడవైన తీరం, పోర్టులతో ఏపీకి చాలా ఉపయోగం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఇంటర్నెట్ డెస్క్: దేశాభివృద్ధికి పోర్టులు చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. పొడవైన సముద్రతీరం, పోర్టులు ఉండడం ఏపీకి చాలా ఉపయోగంగా ఉందన్నారు. ఏపీలో పోర్టులను మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో రెండో రోజు జరిగిన సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. హైవేలు, గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్లు ఏపీ అభివృద్ధిలో ఎంతో ఉపయోగంగా మారాయన్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపేందుకు కారిడార్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. వచ్చే జనవరి నాటికి బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తి చేస్తామని, ఈ ఎక్స్‌ప్రెస్ వేతో ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటకకూ లాభం చేకూరుతుందని చెప్పారు.


ఖరగ్‌పూర్‌-అమరావతి కారిడార్‌ వస్తే.. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి అన్నారు. అమరావతిలో 192 కి.మీ. రింగ్‌రోడ్‌ వస్తోందని వెల్లడించారు. బెంగళూరు-విజయవాడ కారిడార్‌తో 110 కిలోమీటర్ల దూరం తగ్గిందన్నారు. అలాగే రాయ్‌పూర్-విశాఖ కారిడార్ ప్రాజెక్టు 96 శాతం పూర్తయిందని తెలిపారు. ఈ కారిడార్‌తో ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు మేలు జరుగుతుందన్నారు. విశాఖ-మచిలీపట్నం కారిడార్ కూడా ఏపీ అభివృద్ధికి కీలకంగా మారుతుందన్నారు. భవిష్యత్తులో ఏపీ అభివృద్ధిలో పోర్టులే కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి చెప్పారు.


ఈ వార్తలూ చదవండి

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

Updated Date - Nov 13 , 2026 | 06:22 PM