Share News

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 13 , 2026 | 05:53 PM

రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే..

ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలి: సీఎం చంద్రబాబు
Andhra Pradesh Investments

విశాఖపట్నం, నవంబర్ 13: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు పారిశ్రామిక రంగంలో ప్రోత్సాహం కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో 50 శాతం మంది పారిశ్రామికవేత్తలు మహిళలే ఉండేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

సీఐఐ సదస్సు ద్వారా వివిధ దేశాల నుంచి సుమారు 450 మంది ప్రతినిధులు హాజరయ్యారని, మొత్తం 194 ఒప్పందాలు కుదిరి రూ.9.98 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రానికి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, వారు చేపట్టిన ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. తలసరి ఆదాయంలో ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.


విశాఖపట్నం స్వచ్ఛమైన నగరంగా మంచి గుర్తింపు తెచ్చుకుందని, ఇటీవల స్వచ్ఛ్‌ షహర్‌ విభాగంలో అవార్డు రావడం నగర పారిశుధ్య నిర్వహణకు నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టామని, సౌరవిద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి జలవనరుల వినియోగం అత్యంత కీలకమని పేర్కొంటూ గోదావరి-కావేరి నదుల అనుసంధానం తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు పరిష్కారం లభించడంతో పాటు సాగు, తాగునీటి అవసరాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే శుభవార్త వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..

ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన

Updated Date - Nov 13 , 2026 | 06:28 PM