Share News

రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:22 PM

విశాఖపట్నంలో నవంబర్ 12, 13 వ తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ భాగస్వాముల సదస్సులో కేంద్ర ఇంధన శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన పెట్టుబడిదారులను, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
ap cii summit investments

విశాఖపట్నం, నవంబర్ 13: జిల్లాలో నిర్వహిస్తున్న 31వ సీఐఐ సదస్సులో కేంద్ర ఇంధన శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన పెట్టుబడిదారులను, ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు.


సీఐఐ సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయని.. ఒకే వేదికపై రూ. 43,871 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 17 ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రూఫ్‌టాప్ సోలార్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు. తక్కువ కాలంలోనే 7.86 లక్షల ఇళ్లకు సోలార్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రం త్వరలోనే హరిత ఇంధన ఉత్పత్తికి కేంద్రంగా నిలుస్తుందని జోషి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ఫైర్.. రూ.100 కోట్ల ఖర్చుపై ప్రశ్నలు

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? దర్యాప్తు చేయాలంటూ కవిత డిమాండ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 04:29 PM