Share News

ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. 24 కంపెనీలతో మంత్రి లోకేశ్ కీలక ఒప్పందాలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:52 PM

విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఏపీకి భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. సదస్సు రెండో రోజు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 24 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో రూ.1,05,634 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఏపీకి భారీ పెట్టుబడుల వెల్లువ.. 24 కంపెనీలతో మంత్రి లోకేశ్ కీలక ఒప్పందాలు
Andhra Pradesh Investments

విశాఖపట్నం, నవంబర్ 13: నగరంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఏపీకి భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి. సదస్సు రెండో రోజు కూడా పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి నారా లోకేశ్ వరుసగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు.. పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలు జరిపారు.

ఈ క్రమంలో లోకేశ్ సమక్షంలో 24 ప్రముఖ కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో భారీ పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం రూ.1,05,634 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరగ్గా.. వీటి ద్వారా సుమారు 75,055 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏరోస్పేస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, హెల్త్‌కేర్, పునరుత్పాదక ఇంధన రంగాలకు చెందిన సంస్థలు రాష్ట్రంలో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపడం పారిశ్రామిక వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


ఈ ఒప్పందాల్లో భారీ స్థాయి పెట్టుబడులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పంచశీల్ రియాల్టీ సంస్థ రూ.37 వేల కోట్లతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండగా, ఏఎం ఏఐ ఫ్యాక్టరీ రూ.31,387 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. అలాగే వారీ ఎనర్జీస్ రూ.10 వేల కోట్లు, క్లీన్‌మాక్స్ ఎన్విరో ఎనర్జీ రూ.8 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. మరోవైపు స్మాక్స్ డిజిటెక్ రూ.5,770 కోట్లతో స్పోర్ట్స్ విలేజ్‌లు, స్పోర్ట్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయనుంది. రక్షణ, విమానయాన, వైద్య రంగాల్లోనూ పలు సంస్థలు పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేశాయి.


రెండోరోజు ఒప్పందాల వివరాలు..

1. SALVO ఇండస్ట్రీస్ - రూ.800 కోట్ల పెట్టుబడి - 2,000 ఉద్యోగాలు

2. బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ - రూ.550 కోట్ల పెట్టుబడి - 565 ఉద్యోగాలు

3. ఐజీ డిఫెన్స్ - రూ.500 కోట్ల పెట్టుబడి - 1,000 ఉద్యోగాలు

4. ఆర్చియన్ గ్రూప్ - రూ.2,000 కోట్ల పెట్టుబడి - 1,200 ఉద్యోగాలు

5. కెయిన్స్ టెక్నాలజీ ఇండియా - రూ.3,145 కోట్ల పెట్టుబడి - 2,000 ఉద్యోగాలు

6. ఏఐఎల్ డిక్సాన్ టెక్నాలజీస్ - రూ.450 కోట్ల పెట్టుబడి - 7,000 ఉద్యోగాలు

7. యోధ హెల్త్ కేర్ & హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1,359 కోట్ల పెట్టుబడి - 4,925 ఉద్యోగాలు

8. పవన్ హాన్స్ హెలీ పోర్ట్స్ అభివృద్ధికి ఎంఓయూ

9. స్మాక్స్ డిజిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీ స్పోర్ట్స్ విలేజ్) - రూ.4,270 కోట్ల పెట్టుబడి - 8,000 ఉద్యోగాలు

10. స్మాక్స్ డిజిటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీ డిస్ట్సిక్ట్ స్పోర్ట్స్ క్లబ్స్ & ఎరినా) - రూ.1,500 కోట్ల పెట్టుబడి - 3,000 ఉద్యోగాలు

11. పీవీఎస్ రామ్మోహన్ హెల్త్ కేర్ - రూ.312 కోట్ల పెట్టుబడి - 1,500 ఉద్యోగాలు

12. సబ్ స్టేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా - రూ.931 కోట్ల పెట్టుబడి - 4,000 ఉద్యోగాలు

13. ఇన్ఫినిటీ - రూ.250 కోట్ల పెట్టుబడి - 1,100 ఉద్యోగాలు

14. సైయింట్ DLM & హిందుస్థాన్ షిప్ యార్డ్ - రూ.1,000 కోట్ల పెట్టుబడి

15. ఏఎం ఏఐ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ – రూ. 31,387 కోట్ల పెట్టుబడి – 1000 ఉద్యోగాలు

16. కిమ్స్ హాస్పిటల్స్ – రూ.1,500 కోట్ల పెట్టుబడి – 2000 ఉద్యోగాలు

17. పంచశీల్ రియాల్టీ (హైపర్ స్కేల్ డేటా సెంటర్) - రూ.37,000 కోట్ల పెట్టుబడి - 32,000 ఉద్యోగాలు

18. వారీ ఎనర్జీస్ - రూ.10,000 కోట్ల పెట్టుబడి - 1,000 ఉద్యోగాలు

19. క్లీన్‌మాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ - రూ.8,000 కోట్ల పెట్టుబడి - 50 ఉద్యోగాలు

20. ఈపాక్ డేటా సెంటర్ సొల్యూషన్స్ - రూ.570 కోట్ల పెట్టుబడి - 2,565 ఉద్యోగాలు

21. ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ - రూ.10 కోట్ల పెట్టుబడి - 100 ఉద్యోగాలు

22. హొరిబా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ ఎంఓయూ

23. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (UNEP) - క్లైమేట్ రెస్పాన్స్ అర్బన్ ప్లానింగ్, అమరావతి ఎంఓయూ

24. సముద్ర సూర్య LLC - రూ.100 కోట్ల పెట్టుబడి - 50 ఉద్యోగాలు


ఈ వార్తలు కూడా చదవండి

మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..

ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన

Updated Date - Nov 13 , 2026 | 05:11 PM