Share News

జేఎన్‌టీయూ సెక్యూరిటీ టెండర్లపై హైకోర్టు స్టే

ABN , Publish Date - Nov 13 , 2026 | 07:55 PM

జేఎన్‌టీయూ సెక్యూరిటీ టెండర్లు పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. రూ.5 కోట్ల సెక్యూరిటీ టెండర్‌లో అక్రమాల ఆరోపణలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

జేఎన్‌టీయూ సెక్యూరిటీ టెండర్లపై హైకోర్టు స్టే

ఇంటర్నెట్ డెస్క్: జేఎన్‌టీయూ సెక్యూరిటీ టెండర్లు పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. రూ.5 కోట్ల సెక్యూరిటీ టెండర్‌లో అక్రమాల ఆరోపణలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, జేఎన్టీయూ-హైదరాబాద్ రీసెర్చ్ స్కాలర్ జవ్వాజి దిలీప్ ఈ పిల్ వేశారు. ఆయన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. టెండర్‌కు సంబంధించిన వివరాలను ఈనెల 16 లోపు సమర్పించాలని యూనివర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది.


విచారణ పూర్తయ్యే వరకు కొత్త ఏజెన్సీ విధుల్లో చేరకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. బి సెక్యూర్ ప్రొటెక్షన్ సంస్థకు ఇచ్చిన సెక్యూరిటీ భాద్యతలపై స్టే విధించింది. కాగా.. టెండర్ వ్యవహారంపై ఏసీబీ, విజిలెన్స్‌కు ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయని, వీసీపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని పిటిషనర్ కోరారు.


ఈ వార్తలూ చదవండి

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

సంప్రదాయాలకు భిన్నంగా అనిరుధ్‌-కావ్య వివాహ వేడుక.. ఏమిటా పెళ్లి పద్ధతి..

Updated Date - Nov 13 , 2026 | 08:03 PM