Share News

నిమ్స్‌ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు: మంత్రి రాజనర్సింహ ఆదేశం

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:52 PM

పంజాగుట్ట నిమ్స్‌లో వెయిటింగ్ పేషెంట్లకు సనత్‌నగర్ టిమ్స్‌లో సర్జరీలు నిర్వహించాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

నిమ్స్‌ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు: మంత్రి రాజనర్సింహ ఆదేశం
TG Minister Damodara Raja Narasimha

హైదరాబాద్, నవంబర్13: పంజాగుట్ట నిమ్స్‌లో వెయిటింగ్ పేషెంట్లకు సనత్‌నగర్ టిమ్స్‌లో సర్జరీలు నిర్వహించాలని అధికారులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ రెండు ఆసుపత్రుల సమన్వయంతో సర్జరీల వెయిటింగ్‌కు చెక్ పెట్టాలని వారికి స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో నిమ్స్‌లో అందుతున్న వైద్య సేవలపై మంత్రి సమీక్షించారు.


ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. నిమ్స్‌లో పెరుగుతున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ థియేటర్ల కొరతతో సర్జరీల కోసం పేషెంట్లు నిరీక్షిస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సర్జరీల కోసం టిమ్స్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లను వినియోగించాలని అధికారులకు స్పష్టం చేశారు.


అందుకోసం వెంటనే టిమ్స్‌ను సందర్శించాలని నిమ్స్‌లోని వివిధ విభాగాల అధిపతులు (హెచ్‌వోడీలు)కు సూచించారు. అదనపు వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. టిమ్స్‌లో వైద్యుల నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని వారిని ఆదేశించారు. ఈ నియామకాలు పూర్తయ్యే వరకు టిమ్స్‌లో నిమ్స్ వైద్యుల సేవలు కొనసాగాలని పేర్కొన్నారు.


ఈ సమీక్ష సమావేశంలో నిమ్స్, టిమ్స్ వైద్యులతోపాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరో వైపు జూబ్లీహిల్స్ ఎంసీఆర్‌‌హెచ్‌ఆర్డీలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి వైద్యశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్స్, టిమ్స్‌కు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి.. వివిధ శాఖల అధికారులతో కూలంకషంగా చర్చించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? దర్యాప్తు చేయాలంటూ కవిత డిమాండ్

ఎల్‌నినో ముప్పుపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. కేంద్ర ఆర్థిక సాయం కోరనున్న ప్రభుత్వం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 13 , 2026 | 05:43 PM