ఒక్క మ్యాచ్‌తో కుల్‌దీప్‌ను తక్కువగా అంచనా వేయకండి: దినేశ్ కార్తీక్
ABN , Publish Date - Nov 13 , 2026 | 07:04 PM
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ పేలవ ప్రదర్శన చేశాడు. అతడిపై విమర్శలు వస్తోన్న వేళ.. టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ పేలవ ప్రదర్శన చేశాడు. ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే కుల్‌దీప్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్న వేళ.. టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన అతడి ఆటతీరును పూర్తిగా తప్పుబట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
‘రన్‌అప్, బంతిని విడుదల చేసే విషయంలో కుల్దీప్ ఇంకా మెరుగ్గా చేయాల్సిందని అనిపించింది. అయితే ప్రాక్టీస్‌లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వేరు.. మైదానంలోకి దిగి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం వేరు. కుల్‌దీప్‌కు ఇటీవల కాలంలో తుది జట్టులో చోటు దక్కడం లేదు. అకస్మాత్తుగా అవకాశం వస్తే వెంటనే అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శన చేయడం అంత సులభం కాదు. ఈ రోజు అతడికి మంచి రోజు కాదు. కానీ ఒక్క మ్యాచ్ ప్రదర్శనను మరీ ఎక్కువగా విశ్లేషించాల్సిన అవసరం లేదు.
కుల్దీప్ విషయంలో నాకు బాధగా ఉంది. అతడు చాలా కాలంగా భారత జట్టులో భాగంగా ఉన్నాడు. ఇలాంటి పర్యటనలో వరుసగా మ్యాచ్‌లు ఆడకుండా ఉండి, ఒక్కసారిగా వన్డే ఆడాల్సి వస్తే కష్టంగా ఉంటుంది. అతడు మరీ చెత్తగా బౌలింగ్ చేశాడని నేను అనుకోవడం లేదు. కొన్ని కీలక సందర్భాలు అతడికి ప్రతికూలంగా మారాయి. బౌలింగ్ ప్రారంభంలోనే ఒక వికెట్ తీసి ఉంటే అతడికి ఆత్మవిశ్వాసం వచ్చేది. కానీ అది జరగలేదు. తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే వికెట్లు తీసే అవకాశాలు పెద్దగా సృష్టించలేకపోయాడు’ అని దినేశ్ కార్తీక్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!