అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:43 PM
2025 వన్డే ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కింది. జైపూర్‌లోని నహర్‌గఢ్ హిస్టారికా మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 2025 వన్డే ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం దక్కింది. జైపూర్‌లోని నహర్‌గఢ్ హిస్టారికా మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్మన్ ప్రత్యేక అతిథిగా హాజరైంది. కాగా త్వరలోనే ఈ మైనపు విగ్రహాన్ని మ్యూజియం ప్రదర్శనకు ఉంచనున్నారు.
తన మైనపు విగ్రహాన్ని చూసిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆనందం వ్యక్తం చేసింది. ఇది తనకు ఎంతో గర్వకారణమైన సందర్భమని పేర్కొంది. ఈ విగ్రహాన్ని ఎంతో శ్రద్ధతో రూపొందించిన కళాకారులు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపింది. 2025 నవంబర్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా జైపూర్ వ్యాక్స్ మ్యూజియం ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ఆ ప్రకటనకు అనుగుణంగా ఇప్పుడు విగ్రహాన్ని రూపొందించి ఆవిష్కరించారు. త్వరలోనే నహర్‌గఢ్ మ్యూజియంలో సందర్శకులకు ఇది అందుబాటులోకి రానుంది.
ఇవి కూడా చదవండి:
సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ!
న్యూజిలాండ్‌దే నాలుగో వన్డే.. టీమిండియా ఘోర ఓటమి