రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్.. తొలి ఓవర్లో మూడు వికెట్లు తీసిన మ్యాట్ హెన్రీ..
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:00 PM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలోనే పేకమేడలా కూలిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలోనే పేకమేడలా కూలిపోయింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముగ్గురూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ తొలి ఓవర్లోనే ఈ ముగ్గురినీ ఔట్ చేసి భారత శిబిరంలో కలవరం రేపాడు. వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఇది అత్యంత ఘోరమైన ఆరంభాల్లో ఒకటిగా నిలిచింది (India vs New Zealand 4th ODI).
334 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ (Matt Henry) నిప్పులు చెరిగే బంతులతో భారత స్టార్లను బెంబేలెత్తించాడు. మొదట ఓపెనర్ రోహిత్ శర్మను పరుగుల ఖాతా తెరవకుండానే వెనక్కి పంపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీని కూడా బౌల్డ్ చేశాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను అదే ఓవర్ చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆ తర్వాత గైక్వాడ్ (5) కూడా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది (IND vs NZ Cricket). విల్ యంగ్ (125) సెంచరీతో రాణించగా, టిమ్ సైఫెర్ట్ 58 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో కివీస్ 334 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్‌ను మ్యాట్ హెన్రీ దెబ్బతీశాడు. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేశారు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ (17), అక్షర్ పటేల్ (5) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ ఇంకా 40 ఓవర్లలో 306 పరుగులు చేయాలి. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!
న్యూజిలాండ్ ఓపెనర్ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు కివీస్ స్కోరు 75/2