ఆరు వికెట్లతో విధ్వంసం.. హెన్రీకి జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 13 , 2026 | 05:35 PM
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో తనను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీకి కోహ్లీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మైదానంలో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మైదానం బయట మాత్రం తన స్పోర్ట్స్మన్షిప్తో మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో తనను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీకి కోహ్లీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం హెన్రీని కలిసిన విరాట్.. తన జెర్సీని అతడికి బహూకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో హెన్రీ వేసిన తొలి ఓవర్లోనే కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. కేవలం నాలుగు బంతులే ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. హెన్రీ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు కోహ్లీ దగ్గర సమాధానం లేకుండా పోయింది. అయితే మ్యాచ్ అనంతరం ఇద్దరూ ఈ వికెట్ గురించి సరదాగా చర్చించుకున్నారు. కోహ్లీ తన జెర్సీని అందించడంతో హెన్రీ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో మ్యాట్ హెన్నీ 6 వికెట్లతో చెలరేగాడు. దీంతో న్యూజిలాండ్ 244 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
అదృష్టం కలిసొచ్చింది: హెన్రీ
తన ప్రదర్శనపై మ్యాట్ హెన్రీ మ్యాచ్ అనంతరం స్పందించాడు. బౌలింగ్‌కు వాతావరణ పరిస్థితులు కూడా సహకరించాయని తెలిపాడు. ‘అవును.. ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది కదా! గాలి చాలా బలంగా వీస్తోంది. అందుకే నా ప్రణాళికను సాధ్యమైనంత సులభంగా అమలుపర్చాను. కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. ఒక బంతి కొంచెం తక్కువ ఎత్తులో వచ్చింది. గాలి కూడా నా బౌలింగ్‌కు సహకరించి ఉండొచ్చు. గాలి దిశను బట్టి చూస్తే బంతి స్వింగ్ గురించి నేను మరీ ఎక్కువగా ఆలోచించలేదు. తొలి బంతి నుంచే నా బలాలను నమ్ముకుని వికెట్లను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయాలనుకున్నాను. కొత్త బంతితో బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడానికి మాకు చిన్న అవకాశం ఉంటుందని తెలుసు. తొలి ఓవర్లో బంతి ఇలా అనూహ్యంగా కదిలితే బ్యాటర్లకు ఎదుర్కోవడం చాలా కష్టం’ అని హెన్రీ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!