వయోజన విద్య పెంపు కోసం కేంద్రం మార్గదర్శకాలు జారీ
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:55 PM
ఉల్లాస్ (అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్లాంగ్ లర్నింగ్ ఫర్ అల్ ఇన్ సొసైటీ) కార్యక్రమం అమలుకు సంబంధించి ఉపాధ్యాయ విద్యా సంస్థల (టీఈఐ) కోసం రూపొందించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ సింగ్ విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉల్లాస్ (అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్లాంగ్ లర్నింగ్ ఫర్ అల్ ఇన్ సొసైటీ) కార్యక్రమం అమలుకు సంబంధించి ఉపాధ్యాయ విద్యా సంస్థల (టీఈఐ) కోసం రూపొందించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ సింగ్ విడుదల చేశారు. దేశంలో అడల్ట్ లిటరసీ (వయోజన విద్య) ని పెంపొందించడం, జీవితాంతం విద్యను ప్రోత్సహించడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం.. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 లక్ష్యాలకు అనుగుణంగా కొనసాగుతోంది. నిరక్షరాస్యులైన పెద్దలకు అక్షరాస్యత నేర్పి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం లక్ష్యంగా ఉల్లాస్ను అమలు చేస్తున్నామని జయంత్ సింగ్ పేర్కొన్నారు. స్టూడెంట్ టీచర్లు దేశ ప్రజలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
స్టూడెంట్ టీచర్లకు కీలక బాధ్యతలు
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గుర్తింపు పొందిన బీఈడీ, బీపీఈడీ, ఎంఈడీ, ఎంపీఈడీ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద ఉపాధ్యాయులుగా సేవలందించవచ్చు. ఒక్కో స్టూడెంట్ టీచర్ (విద్యార్థి ఉపాధ్యాయుడు) ఐదు నుంచి ఎనిమిది మంది నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పాలి. వారు అక్షరాస్యత ధ్రువీకరణ పొందేలా సహకరించాలి. వారు విజయవంతంగా సర్టిఫికెట్ పొందిన తర్వాత విద్యార్థి ఉపాధ్యాయులకు అకాడమిక్ క్రెడిట్లు జారీ చేస్తారు. వివిధ సంస్థలు, నిపుణులతో.. పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం (డీఓఎస్ఈఎల్) చర్చించి ఈ మార్గదర్శకాలను రూపొందించింది. కార్యక్రమం సమర్థంగా అమలయ్యేలా ఎన్సీటీఈ, ఎన్సీఈఆర్టీ, సెంటర్ ఫర్ నేషనల్ సెంటర్ ఫర్ లిటరసీ (సీఎన్సీఎల్), రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ), జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డీఐఈటీలు), రాష్ట్ర అక్షరాస్యతా మిషన్ అధికారులు, జిల్లా అధికారులు, ఉపాధ్యాయ విద్యా సంస్థలు, విద్యార్థి ఉపాధ్యాయుల విధులు, బాధ్యతలను ఈ మార్గదర్శకాల్లో వివరించారు.
ఉల్లాస్ కార్యక్రమం లక్ష్యాలివే..
15 ఏళ్లు పైబడిన, పాఠశాల విద్యను పూర్తిస్థాయిలో అభ్యసించని వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో వారు సమాజంలో గౌరవంగా జీవించడంతోపాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్, ఆఫ్లైన్లో అమలు చేస్తున్నారు. పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, ఉపాధ్యాయ విద్యా సంస్థలు, వర్సిటీ విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ కార్యక్రమం లక్ష్యం.
ఇవి కూడా చదవండి...
కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక