మొబైల్ బ్యాటరీని నోట్లో పెట్టుకున్న బాలుడు.. ఒక్కసారిగా పేలిన వైనం
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:05 PM
ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంత ప్రమాదమూ పొంచి ఉంటుంది. వాటిపట్ల ఏమరుపాటుగా ఉంటే ఎంతటి ప్రమాదం జరుగుతుందో తెలిపే ఒక భయానక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ మొబైల్ షాపులో ఉన్న బాలుడు పక్కనే ఉన్న లిథియం బ్యాటరీని తీసుకున్నాడు. అలా చేత్తో పట్టుకుని ఉన్నట్టుండి నోట్లో పెట్టుకుని కొరికేశాడు. దీంతో ఆ బ్యాటరీ క్షణాల వ్యవధిలో భారీ శబ్ధంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలుడి ముఖం, నోటి భాగాలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతణ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో @rose_k01 అనే యూజర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొబైల్ షాప్ నిర్వాహకులు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు ఇలాంటి వస్తువుల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఘటన అందరికీ ఒక హెచ్చరిక లాంటిదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
బ్యాటరీ ఎందుకు పేలుతుంది.?
మొబైల్ బ్యాటరీలలో లిథియం అయాన్(Lithium-ion) ఉంటుంది. బ్యాటరీని పంటితో కొరికినప్పుడు లోపలి పొరలు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగరంలో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్
నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు..
Read Latest Telangana News And AP News And Telugu News