ముంబై-పుణె హైవేపై..33గంటల ట్రాఫిక్ నరకం
ABN , Publish Date - Feb 06 , 2026 | 02:46 AM
ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై దాదాపు 33గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. మంగళవారం సాయంత్రం ఖండాలా ఘాట్ సెక్షన్‌లో ...
ముంబై, ఫిబ్రవరి 5: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై దాదాపు 33గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. మంగళవారం సాయంత్రం ఖండాలా ఘాట్ సెక్షన్‌లో అతివేగంతో వెళ్తున్న ప్రొపిలీన్ గ్యాస్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదకరమైన, మండే స్వభావం గల గ్యాస్ కావడంతో అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా రోడ్డును మూసివేశారు. బుధవారం రోజంతా ట్యాంకర్‌లోని గ్యాస్ ను మరో వాహనంలోకి మార్చే ప్రక్రియ కొనసాగింది. దీనివల్ల హైవేపై సుమారు 22 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు నరకయాత న అనుభవించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సుధీర్ మెహతా 8గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆయన తన కారును అక్కడే వదిలేసి తిరిగి పుణె చేరుకోవడానికి హెలికాప్టర్‌ను ఆశ్రయించారు. గురువారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి.