బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. ఢిల్లీకి రప్పించిన హైకమాండ్
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:18 PM
పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు విప్ జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై కౌంటింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది పార్టీ అధిష్ఠానం. ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ విప్ ద్వారా బెంగాల్, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్న సభ్యులను కూడా ఢిల్లీకి రప్పించినట్టు తెలుస్తోంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కీలక బిల్లుల ఆమోదం కోసం హైకమాండ్ అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు హాజరుకావాలని 'త్రీ-లైన్ విప్'లో పేర్కొంది హైకమాండ్. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉన్నందున.. సభ్యులంతా సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలంది. కేంద్ర మంత్రులతో సహా ఎంపీలందరూ సభలోనే ఉండాలని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
రాహుల్ ప్రసంగం పీసీ సర్కార్ మ్యాజిక్ షోలా సాగింది: నిషికాంత్ దూబె
మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ