Share News

Maharashtra: జ్యోతిరాదిత్య సింధియా కుమారుడి పాదాలను మొక్కిన 73 ఏళ్ల బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

ABN , Publish Date - Jan 08 , 2026 | 09:54 PM

తనకన్నా చిన్నవయసు ఉన్న యువకుడి పాదాలు తాకిన బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్దరికం అన్న గౌరవం లేదా అని ప్రశ్నిస్తున్నారు.

Maharashtra: జ్యోతిరాదిత్య సింధియా కుమారుడి పాదాలను మొక్కిన 73 ఏళ్ల బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్
BJP leader viral video

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు 31 ఏళ్ల మహార్యమన్ సింథియా పాదాలను 73 ఏళ్ల బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర కుమార్ జైన్ తాకిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 11 సెకన్ల నిడివి గల ఈ వీడియో సోమవారం శివపురి జిల్లా స్టేడియంలో జరిగిన 69వ జాతీయ పాఠశాల క్రీడల నుంచి పోటీ సందర్భంగా జరిగింది. ఇదే రోజు దేవేంద్ర పుట్టిన రోజు కావడంతో క్రీడాకారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.


వీడియోలో కనిపించినట్లు.. దేవేంద్ర తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా మహార్యమన్ పక్కన నిలబడి చప్పట్లు కొడుతూ కనిపించారు. కేక్ కట్ చేసిన తర్వాత, దేవేంద్ర వంగి 31 ఏళ్ల మహార్యమన్ పాదాలు మొక్కాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ ఘటనపై దేవేంద్ర కుమార్ జైన్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంలో చిన్నవారి పాదాలను తాకకూడదని ఎక్కడా చెప్పలేదు. కొంతమంది కావాలని వీడియోను వైరల్ చేస్తున్నారు. అది నన్ను ఏమీ బాధించదు. మీరు వెయ్యి సంవత్సరాలు జీవించాలని అనగానే నేను భావోద్వేగానికి గురయ్యా. కృతజ్ఞతతో నేను ఆయన పాదాలు తాకాను అంతే. ఇది నా వ్యక్తిగత విషయం’ అని దేవేంద్ర అన్నారు. మరోవైపు మహార్యమన్ సింధియా, బీజేపీ నాయకత్వం ఈ వివాదంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇవీ చదవండి:

ఈడీ రెయిడ్స్‌తో పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. ఐప్యాక్ చీఫ్ ఇంటికి సీఎం మమత

లోక్‌సభ దర్యాప్తు కమిటీ ఏర్పాటుపై జస్టిస్ వర్మ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు

Updated Date - Jan 08 , 2026 | 10:07 PM