రెండు లిఫ్టులకు రూ.3.55కోట్లా!
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:53 PM
తంజావూరు జిల్లా స్వామిమలైలో స్వామినాథస్వామి ఆలయంలో కొత్తగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు రూ.3.55కోట్లు అవసరమా? అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు.
బీజేపీ నేత అన్నామలై విమర్శ
చెన్నై: తంజావూరు జిల్లా స్వామిమలైలో స్వామినాథస్వామి ఆలయంలో కొత్తగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు రూ.3.55కోట్లు అవసరమా? అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) ప్రశ్నించారు. స్వామినాథ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు హిందూ దేవాదాయశాఖ నిర్ణయించింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ పథకానికి భక్తులు కానుకగా చెల్లించిన నిధుల నుండి రూ.3.55 కోట్లు ఖర్చుపెట్టినట్లు దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు.
ఈ నేపథ్యంలో, అన్నామలై రెండు లిఫ్టుల నిర్మాణానికి రూ.3.55కోట్లు అవసరమా? అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ తన ఎక్స్‌పేజీలో సోమవారం పోస్టు చేశారు. సుమారు 60 అడుగుల ఎత్తులో వున్న ఆలయానికి, తలా 20 మంది ప్రయాణం చేసేందుకు లిఫ్టులు పొందుపరిచేందుకు కేటయించిన నిధుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఒక్కొక్క లిఫ్టులో 20 మంది వరకు ప్రయాణించవచ్చని చెప్పిన నేపథ్యంలో, పది మందిని కూడా భరించగల శక్తి ఆ లిఫ్టులకు లేదని, దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అన్నామలై డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
డేటింగ్ యాప్‌లో పరిచయం.. స్నేహమంటూ దగ్గరై 51 ఏళ్ల వ్యక్తిని
Read Latest Telangana News and National News