ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపిన ‘భాస్కరుడు’
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:34 PM
మెదడు నిర్జీవమైన యువకుడు, తన అవయవాల దానంతో ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించాడు. తిరుప్పూర్ జిల్లా మడత్తూర్ గ్రామానికి చెందిన రాజగోపాల్-విశాలాక్ష్మి దంపతులకు భాస్కరన్ (29) అనే కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
చెన్నై: మెదడు నిర్జీవమైన యువకుడు, తన అవయవాల దానంతో ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించాడు. తిరుప్పూర్ జిల్లా మడత్తూర్ గ్రామానికి చెందిన రాజగోపాల్-విశాలాక్ష్మి దంపతులకు భాస్కరన్ (29) అనే కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భాస్కరన్ అదే ప్రాంతంలో ఉన్న ఓ పేపరు మిల్లులో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం భాస్కరన్ తల్లి విశాలాక్షి మృతిచెందారు. ఆమె 16వ రోజు కార్యం కోసం సరుకులు కొనుగోలుకు భాస్కరన్, ఆయన భార్య ప్రియాంక, 11 నెలల బిడ్డ, సోదరితో కలసి కారులో ఉడుమలైపేట వెళ్లారు. సరుకులు కొనుగోలు చేసి కారులో తిరుగుప్రయాణమయ్యారు.
మార్గమధ్యంలో కారు ప్రమాదానికి గురికాగా, భాస్కరన్ తలకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని వెంటనే కోయంబత్తూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక అతడు మెదడు నిర్జీవమైనట్లు వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచనలతో భాస్కరన్(Bhaskaran) అవయవాలు దానంగా అందించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. వైద్యులు ప్రత్యేక శస్త్రచికిత్స ద్వారా అవయవాలు వెలికితీసి, వివిధ ఆసుపత్రుల్లో అత్యసరమైన ముగ్గురికి పొందుపరిచారు. భాస్కరన్ మృతదేహానికి ఆస్పత్రి నిర్వాహకులు, వైద్యులు, నర్సులు, సిబ్బంది, ప్రజలు నివాళులర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
డేటింగ్ యాప్‌లో పరిచయం.. స్నేహమంటూ దగ్గరై 51 ఏళ్ల వ్యక్తిని
Read Latest Telangana News and National News