Share News

భార్యను కడతేర్చి.. 'కొత్త అమ్మను తెస్తానంటూ' కూతురితో తండ్రి వింత వ్యాఖ్యలు..

ABN , Publish Date - Nov 13 , 2026 | 07:00 PM

బిహార్‌లోని జమాల్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఒకరు తన భార్యను అత్యంత క్రూరంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

భార్యను కడతేర్చి.. 'కొత్త అమ్మను తెస్తానంటూ' కూతురితో తండ్రి  వింత వ్యాఖ్యలు..
Bihar Crime News

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లోని జమాల్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఒకరు తన భార్యను అత్యంత క్రూరంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన తల్లిని చంపి.. కొత్త అమ్మను తెస్తానంటూ తన తండ్రి వికృతంగా ప్రవర్తించినట్లు మృతురాలి కుమార్తె తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


జమాల్‌పూర్‌లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి దశరథ్ మండల్, అతడి భార్య పూజాదేవి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా మరోసారి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అదే రోజు రాత్రి దశరథ్ తన 10 ఏళ్ల పెద్ద కుమార్తె శ్రీనిఖ, చిన్న కుమార్తె ఇషికాలను బెడ్ కిందకు లాగి, వారిని ఒక చున్నీతో కట్టేశాడు. అనంతరం పూజా దేవిని కత్తితో రెండుసార్లు పొడిచాడు.


తల్లి హత్యను కళ్లారా చూసిన పెద్ద కుమార్తె భయంతో కేకలు వేయబోతుండగా, తండ్రి ఆమెను అడ్డుకుని వింత సమాధానం చెప్పాడు. 'నీ తల్లి చనిపోయింది. నేను నీకు మరో కొత్త అమ్మను తెస్తాను'అని నిందితుడు చెప్పినట్లు పెద్ద కుమార్తె తెలిపింది. 'అమ్మ స్థానాన్ని ఎవరూ భార్య చేయలేరు' అంటూ చిన్నారి బోరున విలపించింది. హత్య అనంతరం భార్య మృతదేహాన్ని దుప్పటితో కప్పి.. ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నిందితుడు లొంగిపోయాడు. ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తన కళ్ల ముందే తల్లి ప్రాణాలు తీసిన హంతక తండ్రికి చట్టపరంగా కఠినమైన శిక్ష విధించాలని మృతురాలి కుమార్తెలు కోరుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలూ చదవండి

హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

Updated Date - Nov 13 , 2026 | 07:01 PM