హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
ABN , Publish Date - Nov 13 , 2026 | 06:13 PM
హైదరాబాద్ ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే అని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సులో పాల్గొన్న ఆయన.. సీఎం చంద్రబాబు విజన్‌ను కొనియాడారు.
విశాఖపట్నం, నవంబర్ 13: హైదరాబాద్ ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదే అని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖపట్నంలో నిర్వహించిన 31వ అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి.. సీఎం చంద్రబాబు విజన్‌ను కొనియాడారు.
విశాఖపట్నంలో నవంబర్ 12, 13వ తేదీల్లో నిర్వహించిన సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఈ సదస్సులో అనేక కంపెనీలు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తారని.. హైదరాబాద్‌లో ITని అభివృద్ది చేసిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి కొనియాడారు. విజనరీ సీఎం చంద్రబాబు.. ఇంధన కొరత గురించి ఆలోచించే.. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రూఫ్‌టాప్ సోలార్‌లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శమని మంత్రి పొగిడారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిమ్స్ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు: మంత్రి రాజనర్సింహ ఆదేశం
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కెనాల్ ఉందా? దర్యాప్తు చేయాలంటూ కవిత డిమాండ్
Read Latest Telangana News And Telugu News