డేటింగ్ యాప్లో ఆహ్వానం.. 20 లక్షల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన ట్రాన్స్జెండర్లు
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:28 PM
ఆన్లైన్ డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తిని ఇంటికి ఆహ్వానించిన ఓ వ్యక్తికి దిమ్మతిరిగే అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యక్తులు అతడిని కత్తితో బెదిరించి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన బెంగళూరులోని చంద్రా లేఔట్లో జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్ డేటింగ్ యాప్లో పరిచయమైన వ్యక్తిని ఇంటికి ఆహ్వానించిన ఓ వ్యక్తికి దిమ్మతిరిగే అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యక్తులు అతడిని కత్తితో బెదిరించి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన బెంగళూరులోని చంద్రా లేఔట్లో జరిగింది. అక్టోబర్ 22న చంద్రా లేఔట్లో ఒక ఇంటి యజమాని తన భార్యతో కలిసి ఊరికి వెళ్లాడు. తన ఇంటి తాళాలను అదే ఇంట్లోని ఓ పోర్షన్లో ఉంటున్న తన స్నేహితుడికి అప్పగించాడు. కాగా.. ఆ వ్యక్తి ఆన్లైన్ డేటింగ్ యాప్లో మహిళగా పరిచయమైన వ్యక్తితో చాటింగ్ చేసి ఇంటికి పిలిచాడు. ఆ వ్యక్తి ఆ ఇంటికి వచ్చిన తర్వాత మాస్క్ తొలగించడంతో ట్రాన్స్జెండర్ అని గుర్తించి అతను ఆశ్చర్యపోయాడు.
పది నిమిషాల తర్వాత మరో ట్రాన్స్జెండర్ కూడా అక్కడికి చేరుకుంది. దీంతో ఇద్దరూ కలిసి అతడిని కత్తితో బెదిరించి, తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు తీయించారు. అనంతరం బెడ్రూమ్ తలుపులు పగులగొట్టి, బీరువాలో దాచి ఉంచిన 226 గ్రామలు బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న ఇంటి యజమాని వెంటనే తన ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంగారు ఆభరణాల విలువ రూ.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు. వారిని నజియా, సయ్యద్ మౌషిన్లుగా గుర్తించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?