Share News

తమిళనాడులో జైలు నుంచి ఖైదీల పరారీ.. కీలక అధికారిపై వేటు వేసిన సీఎం విజయ్

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:46 AM

తమిళనాడులోని థేని జిల్లా జైలు నుంచి 17 మంది విచారణ ఖైదీలు తప్పించుకున్న ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టారు.

తమిళనాడులో జైలు నుంచి ఖైదీల పరారీ.. కీలక అధికారిపై వేటు వేసిన సీఎం విజయ్
CM Vijay

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని థేని జిల్లా జైలు నుంచి 17 మంది విచారణ ఖైదీలు తప్పించుకున్న ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు చేపట్టారు. డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించడంతో పాటు జైలు సిబ్బందిని బదిలీ చేయాలని నిర్ణయించారు.థేని జిల్లా తెక్కంపట్టి సబ్‌జైలు నుంచి అక్టోబర్ 26వ తేదీ సోమవారం రాత్రి 17 మంది విచారణ ఖైదీలు తప్పించుకున్నారు (Theni Jail Escape).


జైలు భద్రతా సిబ్బందిపై దాడి చేసి ఖైదీలు బయటకు పారిపోయారు. ఖైదీల్లో ఒకరు మూర్ఛ వచ్చినట్లు నటించి వైద్య సహాయం కోరినట్లు అధికారులు వెల్లడించారు. గది తలుపు తెరిచిన సిబ్బందిపై ఖైదీలు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారు. విధుల్లో ఉన్న ఇతర సిబ్బందిని కూడా బదిలీ చేయాలని సూచించారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది జైలు సిబ్బందిపై సస్పెన్షన్ చర్యలు చేపట్టారు (Jail Officials Suspended).


ఖైదీలు తప్పించుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు (Tamil Nadu Jailbreak). డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతాల్లోనూ గాలింపు చేపట్టారు. తప్పించుకున్న 17 మందిని 43 గంటల్లో తిరిగి పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని కట్టుదిట్టమైన భద్రత ఉన్న కేంద్ర కారాగారాలకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ ఉన్నతాధికారుల స్థాయిలో మార్పులు చేపట్టారు. జైళ్ల శాఖ డీజీపీగా ఉన్న సందీప్ రాయ్ రాథోడ్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో కె. శంకర్‌ను నియమించారు. జైళ్లలో సీసీ కెమెరాలు, తనిఖీ పరికరాలు, భద్రతా వ్యవస్థలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 31 , 2026 | 11:46 AM