నల్ల సముద్రంలో డ్రోన్ దాడి.. సముద్రంలో మునిగిన గ్రీకు నౌక..
ABN , Publish Date - Oct 31 , 2026 | 10:55 AM
నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న డ్రోన్ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బల్గేరియా తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న గ్రీకు కంటైనర్ నౌకపై మూడు డ్రోన్లు దాడి చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న డ్రోన్ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బల్గేరియా తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న గ్రీకు కంటైనర్ నౌకపై మూడు డ్రోన్లు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న నౌక చివరకు సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలోని మొత్తం 18 మంది సిబ్బందిని బల్గేరియా రక్షణ బృందాలు సురక్షితంగా కాపాడాయి (Black Sea Drone Attack).
నల్లసముద్రంలో ప్రయాణిస్తున్న కాంట్‌షిప్ జెట్ అనే కంటైనర్ నౌకపై అక్టోబర్ 28న దాడి జరిగింది. ఇజ్రాయెల్‌లోని హైఫా నుంచి రొమేనియాలోని కాన్‌స్టాంటా నౌకాశ్రయానికి ఈ నౌక వెళ్తోంది. ఇందులో మొత్తం 421 కంటైనర్లు ఉన్నాయి. బల్గేరియా ప్రత్యేక ఆర్థిక మండలికి సుమారు 21 నాటికల్ మైళ్ల దూరంలో మూడు సముద్ర డ్రోన్లు ఈ నౌకను ఢీకొన్నాయి. ఈ దాడితో నౌక తీవ్రంగా దెబ్బతింది. గురువారం తెల్లవారుజామున నౌక సముద్రంలో మునిగిపోయినట్లు బల్గేరియా ప్రభుత్వం వెల్లడించింది (Greek Container Ship Attacked).
నౌకపై డ్రోన్లు దాడి చేస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి (Black Sea Shipping). వీడియోలో ఒక సముద్ర డ్రోన్ నౌక వైపు వేగంగా దూసుకెళ్లడం, అనంతరం భారీ పేలుడు సంభవించడం కనిపిస్తోంది. పేలుడు తర్వాత నౌక ఒకవైపునకు ఒరిగిపోయింది. ఈ నౌకలో మొత్తం 18 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 14 మంది ఫిలిప్పీన్స్‌కు చెందినవారు కాగా, మరో నలుగురు ఉక్రెయిన్‌కు చెందినవారు. డ్రోన్ దాడి జరిగిన వెంటనే వారిని నౌక నుంచి ఖాళీ చేయించారు. బల్గేరియా నౌకాదళం, సరిహద్దు భద్రతా సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..