ప్రేమించిన యువతికి మరొకరితో నిశ్చితార్థం.. బాడీబిల్డర్ బలవన్మరణం
ABN , Publish Date - Feb 08 , 2026 | 07:43 PM
మూడేళ్లుగా తాను ఎంతో గాఢంగా ప్రేమించిన ప్రియురాలు.. హఠాత్తుగా తనకు నిశ్చితార్థం జరిగిందని ప్రియుడికి చెప్పింది. అది విన్న ప్రియుడు తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగుళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు(Bangalore)కు చెందిన కిరణ్(26) అనే బాడీ బిల్డర్(Body builder) వృత్తిరిత్యా జిమ్ ట్రైనర్. కిరణ్ గత మూడేళ్లుగా ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఇద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. అయితే, శనివారం నాడు కిరణ్‌ని కలిసిన ప్రియురాలు తనకు పెళ్లి కాబోతుందని, నిశ్చితార్థం(Engagement) కూడా జరిగిపోయిందని చెప్పింది. మూడేళ్లుగా తనను ప్రేమించి, ఇప్పుడు మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు కిరణ్. తన ప్రియురాలు చేసిన మోసానికి మనస్తాపానికి గురయ్యాడు.
ఇంటికి చేరుకున్న కిరణ్ నేరుగా తన గదిలోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఎంతసేపటికీ కిరణ్ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు గది తలుపులు పగలగొట్టి చూడగా.. ఫ్యాన్‌కి ఉరివేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కిరణ్ గదిలో ఒక సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ నోట్‌లో తన మొబైల్ పాస్ట్ వర్డ్ రాసినట్లు తెలుస్తోంది. ప్రేమ విఫలం కావడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మద్యం మత్తులో యువతుల రచ్చ.. వైరల్‌గా మారిన వీడియో
ఏఐని నమ్మి.. భార్య లాప్‌టాప్‌ను అప్పగిస్తే.