Share News

మద్యం మత్తులో యువతుల రచ్చ.. వైరల్‌గా మారిన వీడియో

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:21 PM

మద్యం మత్తులో ఇద్దరు యువతులు బెంగళూరులో రచ్చ రచ్చ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారిని షాకైపోయేలా చేస్తోంది.

మద్యం మత్తులో యువతుల రచ్చ.. వైరల్‌గా మారిన వీడియో
Bengaluru viral video

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో (Bengaluru) ఇద్దరు యువతులు (Drunken Women) ఇటీవల మద్యం మత్తులో నానా రచ్చ చేశారు (Ruckus). తమ టూవీలర్‌తో ఓ కారును ఢీకొట్టి ఆపై డ్రైవర్‌పై దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral Video).

వైరల్ వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. ఫుల్లుగా తాగిన ఇద్దరు యువతులు తమ టూవీలర్‌తో ఓ క్యాబ్‌ను ఢీకొట్టారు. దీంతో, డ్రైవర్ వారిని ప్రశ్నించగా అతడితో యువతులు తగాదాకు దిగారు. ఇష్టారీతిన డ్రైవర్‌పై నోరుపారేసుకోవడమే కాకుండా, అతడిపై ఓ యువతి తన హెల్మెట్‌తో దాడి కూడా చేసింది. యువతులను అడ్డుకోబోయిన వారిపైనా దాడికి దిగారు. వారు తమ వద్ద ఉన్న చైన్‌తో డ్రైవర్‌పై దాడి చేశారని కొందరు తెలిపారు.


సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. నిందితులను లీసా, మ్యాథ్యూగా గుర్తించారు.

ఇక ఈ వీడియో చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నంత మాత్రాన ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించకూడదని డిమాండ్ చేశారు. ఇలాంటి వారి వల్ల ఏ తప్పు చేయని వారూ ప్రమాదంలో పడతారని అన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా యువతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!


ఈ వార్తలూ చదవండి:

30 ఏళ్ల మహిళ.. ఈమె కష్టాలు చూస్తే.. వైరల్ వీడియో

యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..

Updated Date - Feb 08 , 2026 | 09:01 PM