30 ఏళ్ల మహిళ.. ఈమె కష్టాలు చూస్తే.. వైరల్ వీడియో
ABN , Publish Date - Feb 08 , 2026 | 03:19 PM
జాబ్ లేని కారణంగా రూ.30 వేల అప్పు చేయాల్సి వచ్చిందంటూ ఓ 30 ఏళ్ల మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం లేక నానా అవస్థలూ పడుతున్నానంటూ ఓ 30 ఏళ్ల మహిళ నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. నికితా అనే మహిళ ఈ వీడియోను షేర్ చేశారు. తాను బెంగళూరులో ఉంటున్నట్టు తెలిపారు (Jobless Woman viral Video).
ఆదాయం లేకపోవడంతో జనవరిలో తాను రూ.30 వేల వరకూ అప్పు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తన ఖర్చులను కూడా వివరించారు. ‘ఇంటి అద్దె రూ.13 వేలు. కరెంటు, వైఫై, ఫోన్ రీచార్జ్, గ్యాస్ బిల్లు వంటివీ ఉన్నాయి. పచారీ సామాన్లు, అప్పుడప్పుడు బయట తినడంతో రూ.8 వేలు ఖర్చైంది. వైద్యం కోసం మరో రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. షాపింగ్ కోసం రూ.1398, సినిమాల కోసం మరో రూ. 1331 ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా పొదుపును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఎస్ఐపీలో నెలనెలా రూ.2 వేలు పెట్టుబడి పెడుతూనే ఉన్నాను. ఆస్ట్రాలజీ యాప్‌పై మరో రూ.800 ఖర్చు చేశా. ఇది వృథా ఖర్చు అని ఇప్పుడు అనిపిస్తోంది. మా అమ్మ నుంచి చేబదులుగా రూ.30 వేల తీసుకున్నా’ అని ఆమె వీడియోలో చెప్పుకొచ్చారు.
ఈ వీడియో సహజంగానే తెగ వైరల్ అవుతోంది. అనేక మంది ఆమె నిజాయతీని మెచ్చుకున్నారు. జాబ్ లేని సమయాల్లో చాలా మంది ఇదే పరిస్థితిని ఎదుర్కుంటారని అన్నారు. ఉద్యోగ ప్రయత్నాలు అంటే కేవలం సంస్థలకు అప్లై చేసుకోవడం మాత్రమే కాదని చెప్పారు. కానీ, ఇలాంటి విషయాలు అంతగా నెట్టింట వైరల్ కావని అన్నారు. ఇతర ఆదాయ మార్గాల కోసం ఆన్‌లైన్‌లో ప్రయత్నించాలని మరికొందరు సూచించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఈ వార్తలూ చదవండి:
యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..
డెలివరీ ఏజెంట్ కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో