శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Feb 08 , 2026 | 03:48 PM
శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలోని యాగశాలలో దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పి. రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అర్చకులతోపాటు వేద పండితులు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహించారు.
శ్రీశైలం, ఫిబ్రవరి 08: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు.. ఆదివారం ఉదయం 9.00 గంటలకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పి. రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావుతోపాటు అర్చకులు, వేద పండితులు యాగశాలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు భేరీ పూజ, భేరీ తాండవం, సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. 9వ తేదీ నుంచి ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం జరగనుంది.
ఇక శివదీక్షా భక్తులకు ఆదివారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు శ్రీమల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కల్పిస్తారు.
ప్రతి రోజూ ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
సాధారణ భక్తులందరూ శ్రీస్వామిఅమ్మవార్ల అలంకార దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
శివదీక్షా భక్తులకు జ్యోతిర్ముడులు సమర్పించుకునే సదుపాయాలను కల్పించారు.
ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అంటే.. 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. మరోవైపు.. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితోపాటు ఆలయ కమిటీ సభ్యులు కలిసి.. ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా అనుకూలం..
సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత.. ఎప్పటినుంచంటే.?
For More Devotional News And Telugu News